google to introduce new button for satellite connectivity location track
అవసరమైన సమయంలో యూజర్ జత చేసిన డివైజెస్ Location ను ట్రాక్ చేయడానికి తగిన అవకాశం Google ఫైండ్ హబ్ యాప్ లో చాలా కాలం నుంచి అందుబాటులో ఉంది. అయితే, ఇప్పుడు గూగుల్ మరింత ముందడుగేసి ఈ ఫీచర్ ను మరింత విస్తరించే దిశగా పని చేస్తోంది. దీనికోసం గూగుల్ ఫైండ్ హబ్ లో కొత్త బటన్ ను జత చేయడానికి సిద్దమయ్యింది. ఈ కొత్త బటన్ ఖచ్చితమైన location గుర్తించడానికి శాటిలైట్ కనెక్ట్ ద్వారా నేరుగా బాటలు వేస్తుంది.
గూగుల్ ఫైండ్ మై హబ్ (ఫైండ్ మై డివైజ్) లో ఈ కొత్త ఫీచర్ ను తీసుకురావడానికి చూస్తోంది. అదేమిటంటే, ఇప్పటి వరకు సాంప్రదాయ నెట్ వర్క్ బేస్డ్ లొకేషన్ కోసం మాత్రమే ఫైండ్ మై డివైజ్ లో అవకాశం ఉండగా, గూగుల్ ఇప్పుడు ఈ ఫీచర్ ను మరింత విస్తరించి ఈ యాప్ లో శాటిలైట్ ఆధారిత లొకేషన్ షేరింగ్ ఫీచర్ అందిస్తుంది. ఈ కొత్త చర్య ద్వారా రానున్న రోజుల్లో నెట్ వర్క్, Wi-Fi లాంటి ఎటువంటి కనెక్టివిటీ లేకున్నా కూడా డైరెక్ట్ శాటిలైట్ ద్వారా రియల్ టైమ్ లొకేషన్ ను ఇతరులతో షేర్ చేయవచ్చు.
ఈ కొత్త శాటిలైట్ లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్ ఆఫ్ గ్రిడ్ (ఏ నెట్ వర్క్ లేని సమయంలో) యూజర్ తన లొకేషన్ ఇతరులకు షేర్ చేయడానికి చక్కగా సహాయం చేస్తుంది. అయితే, ఇది రియల్ టైమ్ ట్రాకింగ్ ఫీచర్ మాత్రం కలిగి ఉండదు. కానీ, ప్రతి 15 నిమిషాలకు ఖచ్చితమైన లొకేషన్ పిన్ ను మీకు సహాయం చేసే వారికి లేదా ఇతరులకు షేర్ చేసే అవకాశం అందిస్తుంది.
అంటే, మీరు ఏదైనా తెలియని ప్రాంతాల్లో చిక్కుకున్నప్పుడు ఎటువంటి నెట్ వర్క్ లేక్ పోయినా మీ లొకేషన్ ను ఫైండ్ మై డివైజ్ లో అందించిన ఈ కొత్త శాటిలైట్ ఫీచర్ ద్వారా మీ ఖచ్చితమైన లొకేషన్ ను పిన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఫీచర్ తో రోజు వారి పరిమితి ఉంటుందని చెబుతున్నారు. వాస్తవానికి, ఇది నిజంగా అద్భుతమైన ఫీచర్ అవుతుంది. ఎందుకంటే, నెట్ వర్క్ లేని సమయంలో అత్యవసర సహాయం కోసం ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది.
Also Read: Tecno Spark Go 5G: బడ్జెట్ ధరలో లైట్ అండ్ ఫాస్ట్ ఫోన్ లాంచ్ చేసిన టెక్నో.!
కేవలం శాటిలైట్ కనెక్టివిటీ మాత్రమే కాదు గూగుల్ ఫైండ్ మై హబ్ యొక్క సామర్ధ్యాలు మరింత విస్తరిస్తోంది గూగుల్. ఇందులో ముందు మొబైల్ మరియు టాబ్లెట్ లకు మాత్రమే లొకేషన్ ట్రాకింగ్ అవకాశం ఉండగా, ఇప్పుడు మరిన్ని డివైజెస్ కి ఈ ఫీచర్ ను ఆపాదించింది. అంతేకాదు, ఇదే యాప్ లో స్నేహితులు మరియు ఫ్యామిలీ మెంబర్స్ తో లైవ్ లొకేషన్ షేర్ చేసే అవకాశం కూడా అందిస్తుంది.