గూగుల్ సొంత రిటైల్ షోరూమ్స్ వచ్చేశాయి

Updated on 21-Jun-2021
HIGHLIGHTS

గూగుల్ తన సేవలను విస్తరించింది

మొదటి రిటైల్ స్టోర్ ప్రారంభించిన Google

అత్యంత ఆధునిక సౌకర్యాలు వీటి సొంతం

ఇప్పటి వరకూ అనన్యమైన సేవలతో ఆకట్టుకున్న గూగుల్, ఇప్పుడు తన సేవలను విస్తరించింది. న్యూయార్క్ మహానగరం లోని చెల్సియా అనే ప్రాంతంలో తన మొట్టమొదటి ఫిజికల్ స్టోర్ ను గూగుల్ ప్రారంభించింది. Apple, Microsoft మరియు Sony వంటి ప్రముఖ సంస్థలతో పాటుగా మరికొన్ని ప్రముఖ సంస్తల మాదిరిగానే గూగుల్ కూడా తన సొంత స్టోర్స్ ను ఓపెన్ చేయడం మంచి వ్యూహాత్మక చర్యగానే చూడవచ్చు.

ఇప్పటికే, Google Pixel స్మార్ట్ ఫోన్ల తో పాటుగా గూగుల్ నెస్ట్, ఫిట్ బిట్ వంటి పరికరాలను అందించిన గూగుల్ ఇప్పుడు తన సొంత ప్రొడక్ట్ లను అమ్మడానికి సొంత షోరూం ఓపెన్ చేసింది. ప్రస్తుతానికి, తన మొట్టమొదటి ఫిజికల్ షోరూం ను న్యూయార్క్ లో ఓపెన్ చేసింది. ఈ షోరూం లో గూగుల్ తయారు చేసిన సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ ప్రోడక్ట్స్ ని అమ్ముతుంది.

ఇక గూగుల్ కొత్తగా ఓపెన్ చేసిన ఈ షోరూమ్ లోపలికి వెళితే కొత్తగా మరియు ఆహ్లాదంగా కనిపిస్తుంది. అంతేకాదు, ప్రతిఒక్కరికి తగిన సౌకర్లను కూడా ఏర్పాటు చేశారు. గూగుల్ హోమ్ లేదా నెస్ట్ వంటి ప్రోడక్ట్స్ ని చెక్ చేయడానికి వీలుగా సౌండ్ ప్రూఫ్ పాయింట్స్ ఏర్పాటు చేసింది. అంతేకాదు, గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లలో ఏదైనా సమస్య ఉంటే ఇక నేరుగా ఈ షోరూమ్ కి వెళ్లి రిపేర్ చేయించుకోవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :