ఆన్లైన్లో లీకైన Google Smart Card : ఇవే ప్రత్యేకతలు

Updated on 20-Apr-2020
HIGHLIGHTS

బ్లూటూత్ ద్వారా కూడా చెల్లించడానికి ఉపయోగించవచ్చు.

గూగుల్ దాని పోటీదారు ఆపిల్ కార్డ్ కి పోటీగా గూగుల్ కార్డ్ గా పిలువబడే స్మార్ట్ డెబిట్ కార్డు తీసుకురావడానికి పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ కార్డ్ వినియోగదారులను వారి స్మార్ట్‌ ఫోన్ మరియు ఆన్‌లైన్ నుండి బ్యాలెన్స్ చెక్, స్టేట్‌మెంట్‌లు రూపొందించడం మరియు మరికోన్ని ఇతర ఇతర ఫీచర్లతో  కొనుగోళ్లు చేయడానికి అనుమతిస్తుంది. కో-బ్రాండింగ్ మరియు ఫిజికల్ కార్డుల జారీ కోసం గూగుల్ సిటీ మరియు స్టాన్ఫోర్డ్ ఫెడరల్ క్రెడిట్ యూనియన్ తో సహా వివిధ బ్యాంకులతో సహకరిస్తోంది.

 

టెక్ క్రంచ్ షేర్ చేసిన లీక్డ్ చిత్రాల ప్రకారం, గూగుల్ కార్డ్ పీర్-టు-పీర్ చెల్లింపులకు మించి దాని వినియోగ పరిమితిని విస్తరించడం ద్వారా గూగుల్ పే ఆప్ క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, గూగుల్ జారీ చేసిన కార్డ్ ఉనికిని నిర్ధారించే క్రోమ్‌ కు జోడించిన కొత్త కోడ్‌ లను 9to5Google కనుగొన్నట్లు నివేదించింది.

కార్డ్ డిజైన్ మరియు ఆప్ ఇంటర్‌ఫేస్ ఇంకా అభివృద్ధిలో ఉన్నప్పటికీ, గూగుల్ తన స్మార్ట్ డెబిట్ కార్డుతో ఎలా ముందుకు వెళుతుందో అని ఒక ఆలోచన వచ్చింది. చిప్-ఆధారిత కార్డులో కస్టమర్ పేరు, బ్యాంక్ బ్రాండింగ్ మరియు QR కోడ్ ఉంటుంది. దీన్ని Google ఆప్ కి  కనెక్ట్ చేయడం ద్వారా, వినియోగదారులు ఫింగర్ ప్రింట్ లేదా ఫోన్ యొక్క పిన్ను ఉపయోగించి వారి స్మార్ట్‌ ఫోన్ల నుండి బదిలీ చేయవచ్చు లేదా చెల్లించగలరు.

కస్టమర్ బ్యాంక్ ఖాతాకు కనెక్ట్ అయిన తర్వాత రిటైల్ దుకాణాల్లో కాంటాక్ట్‌ లెస్ చెల్లింపుకు కార్డ్ మద్దతు ఇస్తుందని ఈ నివేదిక సూచిస్తుంది. అదనంగా, వినియోగదారులు వర్చువల్ కార్డ్ వివరాలు ఫోన్‌ లో సురక్షితంగా పొందుపరచబడి ఉన్నందున బ్లూటూత్ ద్వారా కూడా చెల్లించడానికి ఈ ఆప్ ఉపయోగించవచ్చు.

వినియోగదారులకు చెక్ చేయడానికి వివరణాత్మక హిస్టారీతో సహా ఇతర లావాదేవీల డేటా ఆప్ లో అందుబాటులో ఉంది, నంబర్  తిరిగి సెట్ చేయడం ద్వారా లేదా దాన్ని పూర్తిగా లాక్ చేయడం ద్వారా కార్డును రక్షించే అప్షన్ ఉంటుంది. షేర్ చేయబడిన డేటాను పర్యవేక్షించడానికి ఆప్ అందించే చాలా భద్రత మరియు ప్రైవసీ సెట్టింగ్‌లు ఉన్నాయి.

ఇన్ సైట్స్ మరియు “బడ్జెట్ సాధనాలను” అందించేటప్పుడు గూగుల్ పే ప్లాట్‌ఫామ్ ద్వారా బ్యాంక్ ఖాతాలను స్మార్ట్ చెకింగ్ అందించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు టెక్ క్రంచ్‌కు ఒక ప్రకటనలో గూగుల్ తెలిపింది.

గూగుల్ కార్డ్ ఆపిల్ యొక్క టైటానియం-క్లాడ్ గోల్డ్మన్ సాచ్స్-ఆధారిత క్రెడిట్ కార్డుకు ప్రత్యర్థిగా ఉంటుంది, ఇది ప్రస్తుతం దాని కార్డుల ద్వారా ప్రపంచ లావాదేవీలలో 5% వాటాను కలిగి ఉంది. ఫస్ట్-మూవర్ ప్రయోజనాన్ని గూగుల్ కోల్పోయినప్పటికీ, గూగుల్ కార్డ్ ఎప్పటి వరకూ అందుబాటులోకి వస్తుందని మాత్రం ప్రస్తుతానికి తెలియదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :