AI దెబ్బకు 90 శాతం పడిపోయిన Google Search మార్కెట్ షేర్ వాటా.!

Updated on 30-Jul-2025
HIGHLIGHTS

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ ఇంజన్ తో ఎక్కువ ప్రాచుర్యం పొందింది

దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా గూగుల్ సెర్చ్ మార్కెట్ వాటా దారుణంగా పడిపోయింది

AI ప్లాట్ ఫామ్ లు ఎక్కువగా వాడుకలోకి రావడం ప్రధాన కారణంగా చెబుతున్నారు

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ ఇంజన్ తో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఏదైనా వెతకాలంటే ‘గూగుల్ తల్లి’ ని ఆడాల్సిందే అనేంతగా గూగుల్ సెర్చ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే, దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా Google Search మార్కెట్ వాటా దారుణంగా పడిపోయింది. ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న సెర్చ్ మార్కెట్ వాటా లెక్కల ప్రకారం గూగుల్ సెర్చ్ మార్కెట్ దాదాపు 90 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు, దీనికి ప్రధాన కారణంగా AI ప్లాట్ ఫామ్ లు ఎక్కువగా వాడుకలోకి రావడం అని చెబుతున్నారు.

Google Search మార్కెట్ షేర్ పై AI దెబ్బ

2015 నుంచి పెరిగిన గూగుల్ సెర్చ్ వినియోగం మరియు మొబైల్ రంగంలో గూగుల్ ప్రాముఖ్యత తో గూగుల్ సెర్చ్ షేర్ మార్కెట్ వాటా ఇతర కాంపిటీటర్లు అందుకోలేని విధంగా పెరిగిపోయింది. అయితే, ఈ సాంప్రదాయ సెర్చ్ ఇప్పుడు మెల్లగా దారుణంగా పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా AI ప్లాట్ ఫామ్స్ పెరగడం మరియు వాటిని ప్రజలు బాగా ఆదరించడంతో ఈ సాంప్రదాయ సెర్చ్ ఇంజిన్ ప్రాముఖ్యత కోల్పోతున్నట్లు చెబుతున్నారు.

ఇది కేవలం గూగుల్ సెర్చ్ ఇంజిన్ ను మాత్రమే కాదు మైక్రోసాఫ్ట్ Bing, Yahoo, Yandex, DuckDuckGo మరియు Baidu వంటి సెర్చ్ ఇంజిన్స్ పై కూడా ప్రభావం చూపింది.

ఎందుకు Google Search మార్కెట్ షేర్ వాటా పడిపోయింది?

గూగుల్ సెర్చ్ మార్కెట్ పడిపోవడానికి ప్రధాన కారణం AI టూల్స్ తో భారీ కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి రావడం ప్రధాన కారణంగా చూడవచ్చు. ముఖ్యంగా, ChatGPT, Meta AI మరియు Perplexity వంటి AI ఆధారిత ప్లాట్ ఫామ్స్ ఈ వాటాను తగ్గించడంలో కీలక పాత్ర పోషించినట్లు కూడా చెబుతున్నారు. కేవలం ఒక్క చాట్ జిపిటి ప్లాట్ ఇప్పుడు కంప్లీట్ మార్కెట్ సెర్చ్ షేర్ లో 15 నుంచి 20 శాతం వాటా కలిగి ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంటే, గతంలో గూగుల్ సెర్చ్ మాత్రమే అందుకున్న మార్కెట్ షేర్ వాటాను చాట్ జిపిటి పంచుకున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు.

అంతేకాదు, ఇటీవల ఇండియాలో ఎయిర్టెల్ ప్రకటించిన ఉచిత AI ప్లాట్ ఫామ్ యాక్సెస్ తర్వాత Perplexity కూడా ఇండియాలో భారీగా యూజర్ బేస్ ను సంపాదించింది. ఇవన్ని కూడా సంప్రదాయ సెర్చ్ మార్కెట్ షేర్ పై ప్రభావం చూపించాయి. దీని వలన గూగుల్ యాడ్స్ ఆదాయం పై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే, సైట్ ను క్లిక్ చేసి వివరాలు చూసే పనిలేకుండా సింపుల్ గా సమాచారాన్ని అందించే AI ప్లాట్ ఫామ్స్ తో ఈ నష్టం జరుగుతుంది.

Also Read: Noise Air Clips 2: నోయిస్ సక్సెస్ ఫుల్ బడ్స్ లేటెస్ట్ ఎడిషన్ బడ్స్ లాంచ్ చేసింది.!

అయితే, గూగుల్ కూడా మార్కెట్ ను తట్టుకునేందుకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ పై కొత్త AI Mode ను అందించింది. ఈ మోడ్ కూడా అన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలను కుదించి అందిస్తుంది. ఒక వేళ పూర్తి సమాచారం లేదా వివరాలు తెలుసుకోవాలంటే, రిఫరెన్స్ లింక్ కూడా అందుబాటులో ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :