గూగుల్ తన యూజర్ల ఖాతాలను మరింత సురక్షితంగా ఉంచడానికి, గూగుల్ యొక్క Two-Step వెరిఫికేషన్ విడుదల చేస్తున్నట్ల గతంలో వెల్లడించింది. అయితే, ఇప్పుడు ఆ ఆదేశాన్ని ఆచరణలోకి తీసుకువచ్చింది. దాదాపుగా 150 మిలియన్ అకౌంట్స్ ను ఆటోమ్యాటిగ్గా నమోదు చేసుకొనే ప్రక్రియను మొదలుపెట్టింది.
ప్రస్తుతం, అన్ని కాన్ఫిగరేషన్ అవసరాలను పూర్తి చేసిన ఖాతాల మొదటి వేవ్ కోసం ప్రోసెస్ ప్రారంభించబడింది. నవంబర్ 9 నాటికి యూజర్లు వారి అకౌంట్ యొక్క Two-Step వెరిఫికేషన్ ఆటొమ్యాటిగ్గా అందుకుంటారని ముందుగా గూగుల్ మాటిచ్చిన ప్రాకారం దాన్ని అమలుచేసింది.
గూగుల్ ప్రకారం, Two-Step వెరిఫికేషన్ కోసం ఇప్పటివరకూ సైన్ అప్ చెయ్యని యూజర్లు ముందుగా ఆటోమ్యాట్టిగా రిజిస్టర్ చేయబడతాయి. అయితే, ఇది కేవలం వారి కాన్ఫిగిరేషన్ రిక్వైర్ మెంట్ పూర్తి చేసుకువారికి మాత్రమే వర్తిస్తుంది.
అంటే, ఇప్పటివరకూ మొబైల్ నంబర్ రికవరీ ఇ-మెయిల్ లింక్ చెయ్యని యూజర్ల అకౌంట్ లకు ప్రస్తుతం ఈ Two-Step వెరిఫికేషన్ ప్రోసెస్ చేయబడదు.