Duo స్థానాన్ని Meet తో భర్తీ చేసే ఆలోచలనలో Google ఉన్నట్లుగా ఒక కొత్త నివేదిక పేర్కొంది. గత కొద్దీ కాలంగా Meet వినియోగం మరింతగా పెరిగడం మరియు Google ఇప్పటికే రెండు వీడియో కాలింగ్ యాప్స్ కలిగి ఉండడం వంటి కారణాల వలన వీటిని ఏకం చేసే పనిలో భాగంగా, Duo స్థానాన్ని Meet తో భర్తీ చేసే ఆలోచలనలో Google ఉన్నట్లుగా ఈ నివేదిక వివరించింది.
9togoogle ఈ విషయాన్ని గురించి వివరించింది మరియు ఈ నివేదిక ప్రకారం, కరోనా మహమ్మారి కారణంగా ఇంటి నుండి పనిచేసే వారి సంఖ్య పెరగడం మరియు మరిన్ని ఇతర అవసరాల కోసం కూడా వీడియో కాలింగ్ యాప్స్ కి పెరిగిన డిమాండ్ తో పుంజుకున్న Zoom వంటి యాప్స్ గా ఉండేలా అన్ని ఫీచర్లతో పాటుగా ఉచితంగా యాక్సెస్ ఇవ్వడంతో ఈ యాప్ ఊహించని విధంగా గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు గూగుల్ వెల్లడించింది.
అయితే, అదే సమయంలో Duo వినియోగం కూడా పెరిగినప్పటికీ, "ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు" అన్నట్లుగా, ఒకే సంస్థ నుండి రెండు ఒకే విధమైన యాప్స్ ఎందుకనట్లుగా, Google వీటిని ఏకం చేసే ప్రయత్నాలను చేస్తున్నట్లు తెలిపింది. అయితే, Duo లోని ప్రత్యేకమైన మరియు ప్రధానాంశాలైన ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్, 3D ఎఫెక్ట్ మరియు ఫోన్ నంబర్ ద్వారా ఎవరికైనా వీడియో కాలింగ్ చేయ్యడం వంటి వాటిని మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తుందని సూచించారు. అంతేకాదు, Duo నుండి మొదటి రెండు అక్షరాలు Meet నుండి చివరి రెండు అక్షరాలు తీసుకొని "DUET" పేరుతొ ఈ వీడియో కాలింగ్ సర్వీస్ తీసుకురావచ్చని తెలిపింది.