Google People Cards వచ్చేసింది: ఇది Google Search లో మీ విజిటింగ్ కార్డ్ లాగా పనిచేస్తుంది

Updated on 11-Aug-2020
HIGHLIGHTS

People Cards feature తో ప్రజలు మిమల్ని గురించి సెర్చ్ చేసే విధంగా మీ వివరాలను ఫీడ్ చేయ్యడానికీ, గూగుల్ ఇప్పుడు మిమ్మల్ని అనుమతిస్తుంది.

సెర్చ్ రిజల్ట్ పైన, పేరును చూసినప్పుడు ప్రజలు వాటిని కనుగొనడానికి Google People Cards వర్చువల్ విజిటింగ్ కార్డ్ లాగా పనిచేస్తుంది.

మీరు ఈ అప్షన్ ఎంచుకుంటే, మీ గురించి సమాచారం Google Search లో knowledge card గా ప్రదర్శించబడుతుంది.

భారతదేశంలోని మొబైల్ వినియోగదారులకు కొత్త Google అందుబాటులోకి తీసుకొచ్చిన People Cards feature తో ప్రజలు మిమల్ని గురించి సెర్చ్ చేసే విధంగా మీ వివరాలను ఫీడ్ చేయ్యడానికీ,  గూగుల్ ఇప్పుడు మిమ్మల్ని అనుమతిస్తుంది. సెర్చ్ రిజల్ట్ పైన, పేరును చూసినప్పుడు ప్రజలు వాటిని కనుగొనడానికి ఇది వర్చువల్ విజిటింగ్ కార్డ్ లాగా పనిచేస్తుంది.

మీరు ఈ అప్షన్ ఎంచుకుంటే, మీ గురించి సమాచారం Google Search లో knowledge card గా ప్రదర్శించబడుతుంది. ఈ ఫీచర్ వారి పేరు మరియు సమాచారాన్ని ప్రపంచం తెలుసుకోవాలనుకునే వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని తీసుకురాబడింది. ఎంటర్ప్రనువేర్స్ , ఫ్రీలాన్సర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ మరియు ఎక్కువ మంది వ్యక్తులు దీన్ని ఉపయోగకరంగా చూడవచ్చు.

ఇదంతా ఎందుకు ఒక్క మాటలో చెప్పాలంటే, మీ గురించి మీరు ఈ ప్రపంచానికి మీరు తెలియచేయడానికి ఈ People Cards feature చక్కగా ఉపయోగపడుతుంది.     

How to create a People Card on Google?

ప్రస్తుతానికి,  కేవలం స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఈ పీపుల్ కార్డులను సృష్టించవచ్చు. మీ పేరు కోసం పీపుల్ కార్డ్ పొందడానికి, మీ పేరును గూగుల్ ‌లో Search చేయండి లేదా “add me to search” అని అడగండి.

కనిపించే ప్రాంప్ట్ ‌పై నొక్కండి మరియు మీ వివరాలను పూరించడానికి మరియు ధృవీకరించడానికి ఇది మీకు ఒక ఫారమ్‌ పొందుతారు. తప్పనిసరిగా పూరించాల్సిన  వివరాలలో మీ స్థానం (నగరం, దేశం), బయో మరియు వృత్తి ఉన్నాయి. అప్షనల్ గా, మీరు మీ విద్య, పని, హోమ్ టౌన్, వెబ్ ‌సైట్, సామాజిక ప్రొఫైల్స్, ఇమెయిల్ మరియు ఫోన్ నంబర్‌ను చేర్చవచ్చు.

సమాచారం ఎలా సురక్షితం ?

గూగుల్ “ప్రజల కార్డులపై సమాచార నాణ్యతను కాపాడటానికి వివిధ రకాల రక్షణలు మరియు నియంత్రణలను”  అందిస్తుంది. ప్రతి వ్యక్తి యోక్క కార్డు ఫోన్ నంబర్ ద్వారా ఎన్క్రిప్టెడ్ చేయబడిన ఒకే Google ఖాతా వంటి విషయాలు వీటిలో ఉన్నాయి. మీరు మీ ఫోన్ నంబర్‌కు పంపిన ఆరు అంకెల OTP తో మొత్తం ప్రక్రియను ప్రారంభించాలి. కాబట్టి, ఇది మీకు సురక్షితమైన ప్రక్రియనే జరుపుతుందని మీరు నిర్ధారించుకోవచ్చు.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :