Google Meet యొక్క కొత్త అప్డేట్ మీకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. కొత్త అప్డేట్ తో గరిష్టంగా 500 మందిని మీటింగ్ లో పాల్గొనడానికి మీరు అనుమతించవచ్చు. దీని ద్వారా గూగుల్ మీట్ మీటింగ్స్ పరిధిని మరింత విస్తరించే ప్రయత్నం చేసింది. కానీ, ఈ విధమైన అనుమతి పొందాలంటే మీరు ప్రీమియం వర్క్‌స్పేస్ సబ్‌స్క్రైబర్ అయి ఉండాలి.
వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దతిని ప్రపంచవ్యాప్తంగా అందరూ అవలంభిచడంతో వారికీ అవసరమైన మీటింగ్స్ డిజిటల్ రూట్ లోకి మళ్ళాయి. లిమిటెడ్ మెంబర్స్ కోసం ఇది కొన్ని ప్లాట్ ఫారం లలో సాధ్యమైన, ఎక్కువ మందితో కూడిన పెద్ద సమావేశానికి మాత్రం వీటిలో అసాధ్యం. అయితే, Google Meet యొక్క కొత్త అప్‌డేట్‌తో, గరిష్టంగా 500 మంది వరకూ పాల్గొనే మీటింగ్స్ ను కూడా మీరు హోస్ట్ చేయగలరు మరియు ముఖ్య సభ్యులందరినీ ఆహ్వానించవచ్చు.
భారీ స్థాయి మీటింగ్ ఫీచర్స్ కంపెనీలకు సమయం గడిచేకొద్దీ హైబ్రిడ్ మోడల్‌ను సులభతరం చేస్తాయి. అంతేకాదు, భవిష్యత్తులో మరింకేదైనా ప్రతికూల పరిస్థితి వచ్చినా కూడా మల్టీనేషనల్ కంపెనీలు వారి ఈవెంట్స్ ను సునాయాసంగా నిర్వహించేందుకు వీలవుతుంది. ఇటువంటి ఫీచర్స్, ఉద్యోగులకు సహాయం చేయడానికి, లెర్నింగ్ సెమినార్‌లకు మరియు సమావేశాలకు నాయకత్వం వహించడానికి ఉపయోగపడతాయి.