Google Map నుండి User Alert ఫీచర్ : యూజర్లకు రద్దీ ప్రాంతాలు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మరియు Covid-19 చెకపోస్టు వంటి వాటి అలర్ట్ అంధిస్తుంది

Updated on 10-Jun-2020
HIGHLIGHTS

ట్రాన్స్ పోర్ట్, దుకాణాలు మరియు కార్యాలయాలు నెమ్మదిగా తెరిచినప్పటికీ, భౌతిక దూరాన్ని(ఫిజికల్ డిస్టెన్స్) పాటించడం చాలా ముఖ్యం.

User Alert ఫీచర్ ను పొందే దేశాల జాబితాలో మొదటి స్థానంలో భారత్ ఉంది.

ముఖ్యమైన ప్రదేశాలలో వినియోగదారులను అప్రమత్తం చేయడానికీ వీలుగా కొన్ని క్రొత్త ఫీచర్ల సమాహారాన్ని విడుదల చేసింది.

నెలల తరబడి ఇళ్ళలో కట్టిపడేసిన తరువాత, అన్లాక్ 1.0 ద్వారా భారతదేశంలోని ప్రజలు తిరిగి తమ తమ పనులను ప్రారంభించడం మొదలుపెట్టారు. కానీ, ఇప్పటికీ కరోనావైరస్ యొక్క ముప్పు చాలా ఉంది మరియు భారతదేశం ఇప్పటికీ దాని పీక్ స్టేజ్ చూడలేదు.  ట్రాన్స్ పోర్ట్, దుకాణాలు మరియు కార్యాలయాలు నెమ్మదిగా తెరిచినప్పటికీ, భౌతిక దూరాన్ని(ఫిజికల్ డిస్టెన్స్) పాటించడం చాలా ముఖ్యం. ఈ వ్యాధికి ఎటువంటి వ్యాక్సిన్ లేదా మెడిసిన్ లేని కారణంగా, ఈ మహమ్మారిని తగ్గించాడనికి ఇది నిజంగా ఏకైక మార్గంగా నిలుస్తుంది. అందుకే Google Maps , రద్దీగా ఉండే ప్రదేశాలు, వైద్య తనిఖీ కేంద్రాలు మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో వినియోగదారులను అప్రమత్తం చేయడానికీ వీలుగా కొన్ని క్రొత్త ఫీచర్ల సమాహారాన్ని విడుదల చేసింది.

మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఈ User Alert ఫీచర్ ను పొందే దేశాల జాబితాలో మొదటి స్థానంలో భారత్ ఉంది. భారతదేశం కాకుండా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్, కొలంబియా, ఫ్రాన్స్, మెక్సికో, నెదర్లాండ్స్, స్పెయిన్, థాయిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్(UK ) మరియు US  వంటి దేశాలు కూడా ఈ ఫీచరును  స్వీకరిస్తున్నాయి. ఇది iOS మరియు Android యాప్స్ లో అందుబాటులో ఉంటుంది. గతంలో, గూగుల్ మ్యాప్స్ భారతదేశంలో ఆహారం మరియు రాత్రి ఆశ్రయాల స్థానాలను జతచేసింది.

“ఈ రోజుల్లో ఒకచోటి నుండి మరొకచోటుకు చేరుకోవడం మరింత క్లిష్టంగా మారింది. COVID-19 కారణంగా, ఒక నిర్దిష్ట సమయంలో రైలు స్టేషన్ ఎంత రద్దీగా ఉంటుందో లేదా బస్సు పరిమిత షెడ్యూల్‌లో నడుస్తుందో లేదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీ ప్రయాణానికి ముందు మరియు ప్రయాణ సమయంలో ఈ సమాచారాన్ని కలిగి ఉండటం చాలా అవసరం. ప్రపంచవ్యప్తంగా, అన్ని చోట్ల తిరిగి పనులు ప్రారంభం కావంతో, వారి ప్రయాణాలు చేయడానికి సురక్షితంగా నావిగేట్ చేయాల్సిన అవసరం ఉన్న కార్మికులు మరియు ప్రతి ఒక్కరికీ ఇది చాలా ముఖ్యమైనది అవుతుంది ”అని గూగుల్ మ్యాప్స్‌లోని బ్లాగ్ పోస్ట్ లో, ప్రోడక్ట్ నిర్వహణ డైరెక్టర్ రమేష్ నాగరాజన్ రాశారు.

ఈ బ్లాగు ప్రకారం, డ్రైవర్లు మరియు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ చేసేవారికి సామాజిక దూరం , మీరు ఈ మహమ్మారి సమయంలో మీరు వెళ్లాల్సిన ప్రాంతాల కోసం వెతుకుతున్నప్పుడు లోకల్ ట్రాన్స్ పోర్ట్ సంస్థల నుండి గూగుల్ మ్యాప్స్ సంబంధిత సమాచారాన్ని షేర్ చేస్తుంది.

"ఇంపాక్ట్ ట్రాన్సిట్ సేవలను ప్రభుత్వం తప్పనిసరి చేస్తే లేదా ప్రజా రవాణాలో మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంటే తదనుగుణంగా సిద్ధంగా ఉండడానికి ఇది మీకు సహాయపడుతుంది" అని బ్లాగ్ పేర్కొంది. ఈ ట్రాన్స్ పోర్ట్  అలర్ట్ ఫీచర్, భారతదేశం, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్, కొలంబియా, ఫ్రాన్స్, మెక్సికో, నెదర్లాండ్స్, స్పెయిన్, థాయిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యుఎస్‌లతో సహా పలు దేశాలలో LIVE చేయబడింది. ఈ దేశాలు లోకల్ ట్రాన్స్ పోర్ట్ సంస్థల నుండి గూగుల్ మ్యాప్స్‌కు సమాచారాన్ని అందిస్తాయి. తద్వారా, బస్సు లేదా రైలు ఎక్కే ముందు వారు తీసుకోవలసిన చర్యలను నిర్ణయించడంలో వినియోగదారులకు సహాయపడుతుంది.

జాతీయ సరిహద్దును దాటేటప్పుడు COVID-19 చెక్‌పాయింట్లు మరియు మార్గంలో ఉన్న పరిమితుల గురించి తెలియజేసే కొత్త డ్రైవర్ అలర్ట్ లక్షణాన్ని మ్యాప్ లో  విడుదల చేస్తోంది. అయితే, ఈ లక్షణం మాత్రం ప్రస్తుతానికి భారతదేశంలో ఉండదు. కెనడా, మెక్సికో మరియు యుఎస్ దేశాలు మాత్రమే ఈ లక్షణాన్ని పొందుతాయి.

మీరు COVID పరీక్షా కేంద్రానికి(టెస్టింగ్ సెంటర్)కి  వెళుతున్నట్లయితే లేదా వైద్య సదుపాయం కోసం వెళుతుంటే, అర్హతను ధృవీకరించడానికి మరియు ఈ సౌకర్యం కోసం మార్గదర్శకాలను అనుసరించడానికి మ్యాప్స్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది, కాబట్టి మీరు వైద్య అధికారులచే తిరస్కరించబడరు. గూగుల్ లోకల్, రాష్ట్ర మరియు సెంట్రల్  ప్రభుత్వాలు మరియు వారి వెబ్‌సైట్ల నుండి డేటాను స్వీకరిస్తుంది. ఈ లక్షణం భారతదేశానికి వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :