Google మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటుందని మీకు తెలుసా?

Updated on 12-Mar-2021
HIGHLIGHTS

మీరు ఏమి సెర్చ్ చేస్తున్నారు అనే అన్ని విషయాలు కూడా గూగుల్ కి తెలుసు

గూగుల్ కావాలని ఈ విషయాలను సేకరించదు

మీరు అనుకుంటే మాత్రం దాన్ని బ్లాక్ చెయ్యవచ్చు

మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏమిచేసినా Google మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటుందని మీకు తెలుసా? మీరు వెళ్లిన ప్రాంతం, మీరు ఏమి సెర్చ్ చేస్తున్నారు అనే అన్ని విషయాలు కూడా గూగుల్ కి తెలుసు. వాస్తవానికి, గూగుల్ కావాలని ఈ విషయాలను సేకరించదు.

నిజానికి, మీ లొకేషన్ ఆధారంగా రియల్ టైం ట్రాఫిక్, ఫోటోలు, Search మరియు మరికొన్ని ఇతర అవసరమైన వాటిని మీకు      ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి గూగుల్ తన లొకేషన్ సర్వీస్ ను మరింతగా ఇంప్రూవ్ చెయ్యడానికి ఈ విధంగా చేస్తుంది.

అయితే, Google మీ లొకేషన్ ను ట్రాక్ చెయ్యకూడదని మీరు అనుకుంటే మాత్రం దాన్ని బ్లాక్ చెయ్యవచ్చు. ఈ విధంగా చెయ్యడానికి మీకు అవసరమైన స్టెప్స్, ట్రిక్స్ మరియు టిప్స్ ను ఈ క్రింద చూడవచ్చు.

Google లొకేషన్ ట్రాకింగ్ ఆపడం ఎలా?

లొకేషన్ ట్రాకింగ్ ను బ్లాక్ చెయ్యడానికి రెండు పద్దతులను మనం అవలంభించవచ్చు. కానీ ఒక పద్ధతి ద్వారా సులభంగా కేవలం ఒక్క స్వైప్ తో మీ గూగుల్ లొకేషన్ డేటా సేకరణను బ్లాక్ చెయ్యవచ్చు. అందుకే, రెండు పద్దతులను కూడా పరిశీలిద్దాం.  

1. మీ స్మార్ట్ ఫోన్ లోని అన్ని యాప్స్ లోని లొకేషన్ డేటాని బ్లాక్ చెయ్యాలి.

ఈ విధానంలో, మీరు మీ స్మార్ట్ ఫోన్ లోని అన్ని యాప్స్ యొక్క లొకేషన్ డేటాని బ్లాక్ చెయ్యవలసి వుంటుంది. ఇందుకోసం, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ సెట్టింగులకు వెళ్లి Location ను ఎంచుకొని అందులో Location Access బటన్ ను 'Off' చెయ్యండి.

2. Google Location History ని ఆఫ్ చెయ్యండి

ఇది కూడా పైన తెలిపిన విధంగానే వుంటుంది. ఇందులో కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ సెట్టింగులకు వెళ్లి Location ను ఎంచుకొని అందులో Google Location History లోకి వెళ్ళాలి. ఇక్కడ మీ గూగుల్ అకౌంట్స్ అడగబడతాయి. మీ ఫోనులో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ను ఉపయోగించినట్లయితే మాత్రమే ఈ స్టప్ మీకు అవసరమవుతుందని గమనించండి. ఇక్కడ మీకు Activity Control లో Location History కనిపిస్తుంది. దాని ప్రక్కన వుండే టోగుల్ బటన్ ను ఎడమకు తిప్పాలి లేదా ఆఫ్ చెయ్యాలి.

అంతే, ఇలా చేస్తే మీ లొకేషన్ డేటాని Google సేకరించే అవకాశం ఉండదు. అయితే, రియల్ టైం ట్రాఫిక్ మరియు మరిన్ని పర్సనలైజ్డ్ గూగుల్ సర్వీస్ లను అందుకునే అవకాశాన్ని  మీరు కోల్పోతారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :