google introduces new Gemini AI Plus subscription for budget users
ఇటీవల రూ. 19,500 రూపాయల విలువైన జెమినీ ఎఐ ప్రో వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ ను ఇండియా స్టూడెంట్స్ కోసం ఉచితంగా అందించిన గూగుల్, ఇప్పుడు బడ్జెట్ యూజర్ల కోసం Gemini AI Plus చవక సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కూడా తెచ్చింది. గూగుల్ ఇప్పుడు ఈ కొత్త ప్లాన్ కోసం తెరలేపింది. ఈ ప్లాన్ ను చవక ధరలో మంచి AI లాభాలు అందించే విధంగా తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు.
జెమినీ ఎఐ ప్లస్ కొత్త ప్లాన్ ను చవక ధరలో అందించడానికి గూగుల్ సిద్దమయ్యింది. ఈ కొత్త ప్లాన్ ని ఇప్పటికే ఇండోనేషియాలో టెస్ట్ చేస్తోంది మరియు మన రూపాయి ప్రకారం ఈ ప్లాన్ కోసం ఆక్కడ రూ. 400 ఖర్చు అవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ లో కూడా త్వరలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇటీవల Open AI ఇండియాలో బడ్జెట్ ధరలో విడుదల చేసిన Chat GPT Go కి పోటీగా ఈ ప్లాన్ తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే AI మార్కెట్ లో భారీగా పోటీ ఏర్పడించింది మరియు ఎఐ కి పెరుగుతున్న ఆదరణ తో అన్ని కంపెనీలు కూడా పోటీలో నిలిచేలా తమ ప్లాన్ లను పోటీతత్వం తో అందించే ప్రయత్నం చేస్తున్నాయి. చాట్ జిపిటి గో ప్లాన్ ను ఇండియాలో రూ. 399 రూపాయల ధరలో అందించింది. అందుకే, గూగుల్ జెమినీ ఎఐ ప్లస్ ప్లాన్ కూడా ఇండియాలో రూ. 400 కంటే తక్కువ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Samsung Galaxy F17 5G బడ్జెట్ ధరలో గొరిల్లా గ్లాస్ విక్టస్ వంటి భారీ ఫీచర్స్ తో వచ్చింది.!
జెమినీ ఎఐ ప్లస్ ప్లాన్ మంచి ప్రయోజనాలు ఆఫర్ చేస్తుంది. ఇందులో VEO 3 AI వీడియో క్రియేషన్ కోసం 200 AI క్రెడిట్స్ ప్రతి నెలా అందించే అవకాశం ఉంటుంది. అలాగే, ఫోటోల కోసం 200 GB గూగుల్ వన్ స్టోరేజ్, లేటెస్ట్ Notebook LLM, Flow AI ఫిలిం మేకింగ్ టూల్ మరియు ఫీచర్స్ ఈ
ప్లాన్ తో అందించే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే కొనసాగుతున్న చాట్ జిపిటి తో జెమినీ ఎఐ ప్లస్ ప్లాన్ నేరుగా పోటీగా మారే అవకాశం ఉంటుంది. ఇమేజ్ మరియు వీడియో కోసం జెమినీ ఎఐ ప్లస్ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మరింత ప్రాముఖ్యత సంతరించుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి చూడాలి జెమినీ ఎఐ ప్లస్ ప్లాన్ తో ఎంత మార్కెట్ వాటా సొంతం చేసుకుంటుందని.