google introduces Nano Banana Pro known as Gemini 3 Pro Image
Nano Banana Pro : ఇమేజ్ జనరేషన్ మరియు ఎడిటింగ్ కోసం గూగుల్ జైమిని ఎఐ లో నానో బనానా ఫీచర్ ని గూగుల్ తెచ్చింది. ఈ ఫీచర్ చాలా రోజులుగా రోజులుగా అందుబాటులో ఉంది. అయితే, ఇప్పుడు మరింత పవర్ ఫుల్ ఇమేజ్ జనరేషన్ మరియు ఎడిటింగ్ ఫీచర్ గా Gemini 3 Pro Image లేదా నానో బనానా ప్రో కూడా తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ నానో బనానా కంటే మరింత అడ్వాన్స్ గా ఉంటుంది.
నానో బనానా ప్రో అనేది ముందుగా వచ్చిన నానో బనానా యొక్క అడ్వాన్స్ మోడల్ మరియు ఇది మరింత కచ్చితమైన మరియు గొప్ప రిజల్యూషన్ ఇమేజెస్ అందిస్తుంది. ఇది నానో బనానా కంటే చాలా మెరుగైనది మరియు వేగంగా ఉంటుంది. కంటెంట్ ను వేగంగా క్రియేట్ చేయాలనుకునే సాధారణ వినియోగదారుల నుంచి అధిక-నాణ్యత (హై-ఫిడిలిటీ) చిత్రాలు అవసరమయ్యే నిపుణుల వరకు ఇది ఉపయోగపడుతుంది.
గూగుల్ అడ్వాన్స్డ్ రీజనింగ్ తో అందించిన జెమినీ 3 ప్రో, ఈ నానో బనానా ప్రో కి వెన్నుదన్నుగా ఉంటుంది. అంటే ఇది జెమినీ 3 ప్రో సహకారంతో అడ్వాన్స్ రీజనింగ్ వుపయోగించి వాస్తవమైన ఇమేజ్ లను తలపించే ఇమేజ్ లను అందించడమే కాకుండా చాలా స్పష్టమైన టెక్స్ట్ కూడా ఈ చిత్రాలకు జోడిస్తుంది. నానో బనానా అందించిన చిత్రాలు టెక్స్ట్ ను అంత క్లియర్ గా ఫోకస్ చేయడానికి కష్టపడేది. అయితే, మీ ప్రాంప్ట్ తో ఇప్పుడు ఇమేజ్ క్రియేషన్ మరింత వేగం అవుతుంది.
పైన తెలిపిన విధంగా ముందుగా వచ్చిన ఎఐ మోడల్ ఇమేజ్ పైన ఉండే టెక్స్ట్ ను అస్పష్టంగా చిత్రించేది. అయితే, ఈ కొత్త అడ్వాన్డ్స్ మోడల్ చాలా గొప్పగా టెక్స్ట్ ను ఇమేజ్ పై చిత్రిస్తుంది. ఈ కొత్త మోడల్ ఇన్‌ఫోగ్రాఫిక్స్, మెనూ, పోస్టర్‌లు వంటి వాటికి స్పష్టమైన, ఖచ్చితమైన మరియు లేటెస్ట్ స్టైల్‌తో కూడిన టెక్స్ట్‌ను ఇమేజ్ లోనే క్రియేట్ చేయగలదు.
స్టూడియో క్వాలిటీ ఫోటోలు కూడా మీరు ఇప్పుడు నానో బనానా ప్రో ద్వారా పొందవచ్చు. దీనికోసం మీరు తగిన ప్రాంప్ట్ అందిస్తే సరిపోతుంది. అంటే, కెమెరా యాంగిల్, లైటింగ్, కలర్ గ్రేడింగ్ మరియు ఫోకస్ వంటి డిటైల్స్ అందిస్తే మీ ఇమేజ్ మీరు కోరుకునే స్టూడియో క్వాలిటీ గా అందిస్తుంది.
ఈ కొత్త అడ్వాన్స్ మోడల్ మీరు 14 వరకు రిఫరెన్స్ ఇమేజ్ ల వరకు అందించిన వాటిని ఒకే కాంపొజిషన్ లో బ్లెండ్ చేయమని కోరవచ్చు. ఇది బ్రాండ్ లోగో, యూట్యూబ్ బ్యానర్ మరియు మరిన్ని క్రియేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.
నానో బనానా ప్రో ప్రొఫెషన్ అవసరాల కోసం 2K మరియు 4K ఇమేజ్ క్రియేట్ చేసి అందించగలదు.
ఈ కొత్త మోడల్ గూగుల్ సెర్చ్ ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటుంది. అంటే, మేరీ ఏదైనా టాపిక్ పై ఇన్‌ఫోగ్రాఫిక్ కోరితే, ఇది రియల్ టైమ్ లో గూగుల్ సెర్చ్ డేటా ఉపయోగించి వాస్తవాలకు దగ్గరగా ఉండే ఇన్‌ఫోగ్రాఫిక్ ను అందిస్తుంది. ఇది నిజంగా చాలా కూల్ గా ఉంటుంది.
Also Read: 80W Dolby సౌండ్ అండ్ 120Hz తో మూడు QLED Smart Tvs లాంచ్ చేసిన Blaupunkt
ఈ ఫీచర్ ను సాధారణ వినియోగానికి జెమినీ యాప్ లోని ఇమేజ్ జనరేషన్ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు ‘Thinking’ అనే మోడల్ ను ఎంచుకోవడం ద్వారా ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవచ్చు. అదే ప్రొఫెషనల్ లేదా డెవలపర్ యూజర్ వినియోగానికి అయితే, గూగుల్ వర్క్ స్పేస్, Gemini API మరియు Vertex AI లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
ఈ ఫీచర్ తో మెరుగైన రిజల్ట్ కోరుకుంటే, మీ ప్రాంప్ట్ లో యాక్షన్ (Action), సబ్జెక్ట్ (Subject), స్థలం (Location), మరియు కావలసిన స్టైల్ (Style) తో పాటు కెమెరా యాంగిల్ లేదా కెమెరా వివరాలు (ఉదా : లో-యాంగిల్, టాప్ యాంగిల్) వంటివి జత చేయండి.