Google Doodle గేమ్ సిరీస్ : క్రికెట్ గేమ్ తో ఉల్లాసంగా గడపండి

Updated on 28-Apr-2020
HIGHLIGHTS

ఈ సిరీస్‌లో, ఇష్టమైన గేమ్ క్రికెట్ ‌ను ఈ రోజు డూడుల్ ద్వారా ప్రారంభించారు.

కరోనా వైరస్ కారణంగా, దేశవ్యాప్తంగా  లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ మార్చి 24 న ప్రారంభమైంది మరియు మే 3 వరకు పొడిగించబడింది. ఈ లాక్ డౌన్ కారణంగా, ప్రజలు ఇంట్లోనే కాలాన్నే వెళ్లదీస్తూ అలసిపోతారు. అందుకే, గూగుల్ మనకు కొత్త బహుమతులు లేదా పాత జ్ఞాపకాలతో  తరచుగా డూడుల్స్ ద్వారా గుర్తు చేయాలనుకుంటుంది, కాని ఈసారి ఈ సెర్చ్ దిగ్గజం లాక్ డౌన్ లో   గొప్ప ఎంపికతో ముందుకు వచ్చింది. గూగుల్ తన పాత మరియు ప్రసిద్ధ గేమ్స్ యొక్క త్రోబ్యాక్ డూడుల్ సిరీస్ ‌ను పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో, ఇష్టమైన గేమ్ క్రికెట్ ‌ను ఈ రోజు డూడుల్ ద్వారా ప్రారంభించారు. ఈ ఆటను మొదట 2017 లో ప్రవేశపెట్టినట్లు గుర్తు చేసింది.

ఐసిసి ఛాంపియన్ ట్రోఫీని జరుపుకునేందుకు గూగుల్ ఈ ఆటను 2017 లో ప్రారంభించింది. లాక్డౌన్ కారణంగా ఇప్పుడు ప్రజలు దీన్ని ఆస్వాదించగలుగుతారు. మీరు గూగుల్‌లోనే క్రికెట్‌ను ఆస్వాదించవచ్చు మరియు దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. ఈ ఆటలను వాట్సాప్ ‌లో ఆడవచ్చు.

గూగుల్ డూడుల్ గేమ్ ఎలా ప్లే చేయాలి

మీరు గూగుల్ తెరిచిన వెంటనే క్రికెట్ ఆట రూపకల్పనను డూడుల్‌గా చూడవచ్చు. గూగుల్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా, మీరు క్రికెట్ గేమ్ పేజీకి చేరుకుంటారు, అక్కడ మీకు ఈ ఆట ఎంపిక లభిస్తుంది. ఈ విధంగా, Play ఎంపిక పై క్లిక్ చేస్తే మిమ్మల్ని నేరుగా క్రికెట్ గ్రౌండ్ కి తీసుకువెళుతుంది. ఇక్కడి గ్రాఫిక్స్ స్టేడియం లాగా రూపొందించబడ్డాయి, ఇది మీకు స్టేడియం లాగా అనిపిస్తుంది. ఆటగాళ్లే కాకుండా, మీరు ఇక్కడ ప్రేక్షకులను కూడా చూస్తారు.

పిల్లలు మరియు వృద్ధులు ఆడగల గేమ్స్ ను గూగుల్ తన డూడుల్ సిరీ

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :