Google Doodle: AI Mode కోసం గూగుల్ డూడుల్ తో ప్రమోషన్ మొదలు పెట్టిన గూగుల్.!

Updated on 03-Jul-2025
HIGHLIGHTS

AI Mode ను ప్రమోట్ చేయడానికి Google Doodle తో గూగుల్ ప్రమోషన్ మొదలు పెట్టింది

ఈ కొత్త ఎఐ మోడ్ ను జూలై 1వ తేదీ నుంచి US లో ప్రారంభించింది

ఈ ఫీచర్ త్వరలో ఇండియాతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా ప్రవేశపెట్టే అవకాశం

Google Doodle: గూగుల్ లో కొత్తగా జత చేసిన AI Mode ను ప్రమోట్ చేయడానికి గూగుల్ డూడుల్ తో గూగుల్ ప్రమోషన్ మొదలు పెట్టింది. వాస్తవానికి, ఈ కొత్త ఎఐ మోడ్ ను జూలై 1వ తేదీ నుంచి US లో ప్రారంభించింది. ఈ ఫీచర్ త్వరలో ఇండియాతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే, గూగుల్ ఈ కొత్త ఎఐ మోడ్ గురించి పెద్ద ఎత్తున ప్రమోషన్ మరియు టీజింగ్ చేస్తోంది.

Google Doodle: AI Mode

ఎఐ మోడ్ కోసం ఇప్పుడు గూగుల్ యానిమేటెడ్ గూగుల్ డూడుల్ తో ప్రమోషన్ మొదలు పెట్టింది. ప్రస్తుతం ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో (US) అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ కొత్త మోడ్ చేసే పనుల విషయానికి వస్తే, ఈ కొత్త మోడ్ తో AI ఆధారిత సెర్చ్ రిజల్ట్స్ కోసం సింగల్ క్లిక్ యాక్సెస్ అందిస్తుంది. ఇది ప్రస్తుతం వాడుకలో ఉన్న సాధారణ సెర్చ్ కి సూపర్ అప్గ్రేడ్ అవుతుంది. ఈ కొత్త మోడ్ గూగుల్ Gemini AI తో పని చేస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రతి ఒక్కరి చేతికి అందించే ప్రయత్నం చేస్తోంది గూగుల్.

అసలు ఈ AI Mode ఏమిటి?

ఈ కొత్త ఎఐ మోడ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది కూడా చాట్ బాట్ లాంటి సెర్చ్ అనుభూతిని అందించే ఒక సాధనం అని చెప్పవచ్చు అయితే, ఇది జెమినీ ఎఐ తో పని చేస్తుంది మరింత ఖచ్చితమైన సెర్చ్ సోర్స్ గా ఉంటుంది. ఈ కొత్త ఎఐ మోడ్ టెక్స్ట్, వాయిస్ మరియు ఇమేజ్ ఇన్ పుట్ లకు సపోర్ట్ చేస్తుంది, దీనికి ఇచ్చిన కమాండ్ ను ఫాలో చేసి రిచ్ సమోరీస్ అందిస్తుంది అంతేకాదు, ఇది అత్యంత క్లిష్టమైన ప్రశ్నలు కూడా స్వకరించి తగిన గొప్ప సమాధానాలు సులభంగా అందిస్తుందని గూగుల్ చెబుతోంది.

గూగుల్ ఈ కొత్త ఎఐ మోడ్ యాక్సెస్ ను ముందుగా US లో అందించినా, అధిక యూజర్ బేస్ కలిగిన ఇండియాలో కూడా దీన్ని టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ భవిష్యత్ లో వాయిస్ ఇంటరాక్షన్ మరియు కెమెరా ఇన్ పుట్ మరియు మరింత డీప్ సెర్చ్ కోసం ఉపయోగం లోకి తీసుకు వచ్చేలా గూగుల్ యోచన చేస్తోంది.

Also Read: కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K QLED Smart Tv అందుకోండి.!

ఇదే కనుక నిజమైతే, కేవలం స్మార్ట్ ఫోన్ లోనే అన్ని పనులు నిర్వహించే విధంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడుకలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :