తిరిగొచ్చిన జోకర్ మాల్వేర్.. మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి..!!

Updated on 11-Jul-2022
HIGHLIGHTS

గూగుల్ ప్లే స్టోర్ లో జోకర్ మాల్వేర్ బెడద మళ్ళీ మొదలైనట్లు కనిపిస్తోంది

ఒక నాలుగు ప్రముఖ యాప్స్ ఈ జోకర్ మాల్వేర్ ను కలిగివున్నట్లు గూగుల్ గుర్తించింది

మీ ఫోన్ లో ఈ యాప్ లలో ఏదైనా కలిగి ఉంటే వెంటనే డిలీట్ చేయడం మంచిది

గూగుల్ ప్లే స్టోర్ లో జోకర్ మాల్వేర్ బెడద మళ్ళీ మొదలైనట్లు కనిపిస్తోంది. 2017 లో మొదటి సారిగా కనుగొనబడిన జోకర్ మాల్వేర్ అప్పటి నుండి ఈ పేరు వినిపిస్తూనే వుంది. ఇప్పుడు మరొకసారి జోకర్ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్ లో దర్శనమిచ్చింది. ఈసారి ఒక నాలుగు ప్రముఖ యాప్స్ ఈ జోకర్ మాల్వేర్ ను కలిగివున్నట్లు గూగుల్ గుర్తించింది. వెంటనే స్పందించిన గూగుల్ తన ప్లే స్టోర్ నుండి ఆ నాలుగు యాప్స్ ను తొలిగించింది. ఒకవేళ మీరు మీ ఫోన్ లో ఈ యాప్ లలో ఏదైనా కలిగి ఉంటే వెంటనే డిలీట్ చేయడం మంచిది. 

అసలు ఏమిటి ఈ జోకర్ మాల్వేర్?

జోకర్ మాల్వేర్ అనేది మీకు తెలియకుండానే మీ ఫోన్ నుండి ఆన్లైన్ యాడ్స్ మరియు ఆన్లైన్ సర్వీస్ లకు సబ్ స్క్రిప్షన్ ను యాక్సెస్ చేస్తుంది. అంటే, మీకు తెలియకుండానే మీరు తీసుకోని సర్వీస్ లకు మీరు డబ్బు చెల్లిస్తారు. అంటే, ఈ మాల్వేర్ మిమల్ని జోకర్ చేస్తుంది. ఇది ఎంత ప్రమాదకరమైన మాల్వేర్ అంటే, చెల్లింపులను రహస్యంగా ఆమోదించడానికి SMS నుండి OTP లను కూడా యాక్సెస్ చేయగలదు. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను చూసుకునే వరకూ మీకు ఈ విషయం గురించి తెలియదు.

లేటెస్ట్ గా జోకర్ మాల్వేర్ భారిన పడిన యాప్స్

సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కంపెనీ ప్రాడియో ప్రకారం, ఈ జోకర్ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్‌లోని నాలుగు యాప్‌ లలో కనుగొనబడింది. ఈ నాలుగు యాప్ లను ఈ క్రింద ఇచ్చిన లిస్ట్ లో చూడవచ్చు.

1. Smart SMS Message

2. Blood Pressure Monitor

3. Voice Language Translator

4. Quick Text Message       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :