google deep mind jeff dean talks about ai capabilities vs humans
రీసెంట్ గా విడుదల చేసిన మూన్ షాట్ పోడ్ కాస్ట్ లో గూగుల్ డీప్‌మైండ్ చీఫ్ సైంటిస్ట్ Jeff Dean AI సత్తా గురించి సంచలన వ్యాఖలు చేశారు. ప్రస్తుతం AI సాధారణ స్థాయి మనిషిని మంచి మెరుగ్గా పని చేసే సత్తా కలిగి ఉందని, ఆయన ఈ పోడ్ కాస్ట్ లో మాట్లాడారు. కేవలం ఇది మాత్రమే కాదు ఇది మరింత వేగంగా పనులు చేసే దిశగా పరుగులు తీస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఇప్పటికే AI దెబ్బకు చాలా సెక్టార్లో ఉద్యోగుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉండగా, ఈ కొత్త స్టేట్మెంట్ AI గురించి మరింత లోతుగా ఆలోచింప చేసేలా ఉంది .
ప్రస్తుతం AI ఒక సాధారణ హ్యూమన్ కంటే కూడా మరింత మెరుగ్గా పని చేసినట్లు, గూగుల్ డీప్‌మైండ్ చీఫ్ సైంటిస్ట్ జెఫ్ డీన్ మూన్ షాట్ పోడ్ కాస్ట్ లో వ్యాఖ్యానించారు. చాలా మంది కొత్త టాస్క్ లను సరిగ్గా నిర్వహించలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే, ఎఐ మాత్రం చాలా సమర్థవంతంగా మరియు వేగంగా అన్ని టాస్క్ లను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది మంచి ప్రొడక్టివిటీ కి దారి తీస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు.
అయితే, ఎఐ ఇప్పటికీ నిపుణుల స్థాయికి చేరుకోలేదని మరియు దానికి మరింత సమయం పట్టవచ్చని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. అంతేకాదు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగాల్లో ఎఐ బ్రేక్‌త్రూ దిశగా కొనసాగుతోందని జెఫ్ డీన్ చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలతో కొన్ని ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందా? అని అడిగితే నిపుణులు అవును అనే సమాధానం చెబుతున్నారు. అయితే, ఈ ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుందా లేదా పరోక్షంగా ఉంటుందా అని మాత్రమే వివరించి చెప్పలేక పోతున్నారు. అంటే, ప్రొడక్టివిటీ పెంచడానికి ఎఐ తీసుకోవడం మంచి విషయం గా మారుతుంది మరియు తక్కువ హ్యూమన్ సోర్స్ తో ఎక్కువ ప్రొడక్టివిటీ కోసం ఇది ఉపయోగపడుతుంది. అదే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా పనులు నిర్వహిస్తే మాత్రం ఇది ప్రత్యక్ష ప్రభావం అవుతుంది మరియు మానవ జాతి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుంది.
Also Read: Aadhaar Centers కి వెళ్లే పని లేకుండా AI మరియు Face ID తో అప్‌డేట్ ఫీచర్ తెచ్చిన ప్రభుత్వం.!
మరి AI ఉపయోగాలు లేవా? అంటే ఉన్నాయి. వైద్య రంగంలో ఎఐ అద్భుతాలు సృష్టించే దిశగా పయనిస్తోంది. ఇప్పటికే AI సహాయంతో ఆరంభ దశలో వ్యాధులు గుర్తించడం మరియు వాటికి తగిన వైద్యం కోసం హాస్పిటల్స్ పని చేస్తున్నాయి. ఎనర్జీ మరియు స్పేస్ రంగాల్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. మొత్తంగా చూస్తే, ఎఐ ని ఎక్కడ వాడుకలోకి తీసుకోవాలి మరియు ఎక్కడ దూరంగా ఉంచాలో నిర్ణయం తీసుకోవడం ప్రధాన అంశం గా కనిపిస్తోంది.