ఈరోజు జరిగిన 6th ఎడిషన్ ఆఫ్ Google For India కార్యక్రమంలో, గూగుల్ CEO సుందర్ పిచాయ్, ఇండియా డిజిటల్ ట్రాన్సఫార్మేషన్ కోసం 75,000 కోట్లు (US$10బిలియన్) రూపాయల ఫండ్ ను అనౌన్స్ చేశారు. రానున్న 5 నుండి 7 సంవత్సరాలలో దేశంలో పెట్టుబడులు పెట్టనున్న ఈ ఫండ్, ఈక్విటీ సమ్మేళణంగా గూగుల్ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి ఉపయోగించబడుతుంది.
ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతూ, గూగుల్ మరియు ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ మాట్లాడుతూ “భారతదేశంలో నా గత కొన్ని సందర్శనలలో వేగంగా మార్పు రావడం నమ్మశక్యంగా లేదు. సరికొత్త యాప్స్ మరియు సేవలను ఉపయోగిస్తున్న యువకుల ఉత్సాహం నుండి మొదలుకొని, గ్రామీణ ప్రాంతాలు మరియు గ్రామాల్లో ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ప్రజలు స్మార్ట్ ఫోన్‌లను ఉపయోగిస్తున్న మార్గాల మెరియు తీరు వరకు కూడా, భారతదేశంలో గూగుల్ యొక్క ప్రయత్నాలు వివిధ రకాల వ్యక్తులకు సాంకేతికతను వారి వరకూ చేర్చడంలో ఎలా సహాయపడుతుందనే దానిపై తన అవగాహనను మరింత పెంచుకుంది. మొదట భారతదేశం కోసం ఉత్పత్తులను నిర్మించడం, ప్రతిచోటా వినియోగదారుల కోసం మెరుగైన ఉత్పత్తులను రూపొందించడంలో సహాయపడింది. ఈ రోజు, గూగుల్ ఫర్ ఇండియా డిజిటలైజేషన్ ఫండ్ ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను . ఈ ప్రయత్నం ద్వారా మేము 75,000 కోట్ల రూపాయలు లేదా సుమారుగా పెట్టుబడి పెడతాము, అని తెలిపారు.
ఇక అదే కార్యక్రమంలో, భారతదేశంలో COVID-19 వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి గూగుల్ చేస్తున్న పనుల గురించి అందిస్తున్న అప్డేట్స్ ని కూడా వివరించింది మరియు గత రెండు నెలల్లో, గూగుల్ ప్లాట్‌ఫామ్‌లలో వివిధ భాషలలో Covid-19 గురించి 2 బిలియన్లకు పైగా సెర్చ్ జరిగినట్లు పేర్కొంది. అంతేకాదు, అన్ని భారతీయ భాషల్లో కూడా కోవిడ్ 19 గురించి విశ్వసనీయమైన సమాచారాన్ని కలిగి ఉండడమే కాకుండా, MyGov మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ICMR లతో కలిసి పనిచేస్తున్న గూగుల్ 11,000 మందికి పైగా ఆహారం మరియు రాత్రి ఆశ్రయాల సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని కూడా గుర్తుకు చేసింది.