google announced Google Gemini AI free offer for Indian students
భారత స్టూడెంట్స్ కోసం టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ఆఫర్ అందించింది. ఆఫర్ అనడం కంటే మంచి వెసులుబాటు అనడం ఇంకా ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే, గూగుల్ యొక్క ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సర్వీస్ Google Gemini AI ని ఇప్పుడు భారత స్టూడెంట్ కోసం ఉచితంగా ఆఫర్ చేస్తోంది. వాస్తవానికి, ఈ పూర్తి సర్వీస్ కోసం రూ. 19,500 ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, ఈ సర్వీస్ ఇప్పుడు స్టూడెంట్స్ కోసం ఉచితంగా అందిస్తుంది.
గూగుల్ ఈ కొత్త ఉచిత సర్వీస్ ఆఫర్ గురించి నిన్న బాహాటంగానే అనౌన్స్ చేసింది. అయితే, ఈ ఉచిత సర్వీస్ ను కేవలం కాలేజీ స్టూడెంట్స్ కోసం మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీస్ లో అందించే ప్రయోజనాలు కూడా లిస్ట్ అవుట్ చేసింది. ఇందులో, గూగుల్ AI Pro యాక్సెస్ ను అందిస్తుంది. ఈ సర్వీస్ లో Veo 3 Fast, డీప్ సెర్చ్ మరియు NotebookLM వంటి వాటిని స్టూడెంట్స్ అందుకోవచ్చు.
గూగుల్ జెమినీ AI ఉచిత సర్వీస్ అందుకోవడానికి స్టూడెంట్స్ ముందుగా gemini.google/students పేజీని ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు ఆఫర్ మరియు ఆఫర్ వివరాలు కనిపిస్తాయి. ఇందులో ‘Get Offer’ బటన్ కనిపిస్తుంది, ఈ బటన్ పై నొక్కాలి. ఈ కొత్త బటన్ నొక్కగానే గూగుల్ జెమినీ AI ఉచిత సర్వీస్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ ఉచిత సర్వీస్ వివరాలు మరియు అర్హత దృవీకరణ బటన్ ఉంటుంది. ఇందులో ‘Verify Eligibility’ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఈ కొత్త పేజీలో స్టూడెంట్ వివరాలు అప్లికేషన్ ఉంటుంది. ఇందులో, కాలేజీ, స్కూల్, పేరు, పుట్టిన తేదీ మరియు స్టూడెంట్ ఇమెయిల్ ఐడి లను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ అప్లికేషన్ ను వెరిఫై చేసిన తర్వాత అర్హత కలిగిన స్టూడెంట్స్ కి ఈ ఉచిత సర్వీస్ సబ్ స్క్రిప్షన్ ను గూగుల్ అందిస్తుంది.
ఈ సర్వీస్ కోసం మీరు డిగ్రీ లేదా సర్టిఫికెట్ ఆఫర్ చేసే ఏదైనా కాలేజీలో చదువుతూ ఉండాలి. అలాగే, మీరు ప్రస్తుతం చదువుతున్న స్టూడెంట్ అవునో కాదో తెలుసుకోవడానికి గూగుల్ వన్ SheerID ను ఉపయోగిస్తుంది.
Also Read: అండర్ రూ. 5000 ధరలో ఫ్లిప్ కార్ట్ GOAT Sale బెస్ట్ Dolby Soundbar డీల్స్ ఇవిగో.!
గూగుల్ అందించిన ఈ ఉచిత సర్వీస్ కేవలం 2025 సెప్టెంబర్ 15 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ లోపుగా రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ కి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు కూడా ప్రస్తుతం కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ అయితే ఈ ఉచిత సర్వీస్ కోసం అప్లై చేసుకోవచ్చు.