Android 16 ను మరింత సౌకర్యవంతంగా ఆవిష్కరించిన గూగుల్.!

Updated on 14-May-2025
HIGHLIGHTS

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ అతిపెద్ద అప్డేట్ అందించింది

సౌకర్యవంతమైన కొత్త ఫీచర్స్ తో Android 16 ను గూగుల్ ఆవిష్కరించింది

గూగుల్ I/O 2025 సెషన్ నుంచి ఈ కొత్త అప్డేట్ ను రిలీజ్ చేసింది

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ అతిపెద్ద అప్డేట్ అందించింది. యూజర్ కు అనుకూలమైన మరియు సౌకర్యవంతమైన కొత్త ఫీచర్స్ తో Android 16 ను గూగుల్ ఆవిష్కరించింది. గూగుల్ I/O 2025 సెషన్ నుంచి ఈ కొత్త అప్డేట్ ను రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలలో మూడు బిలియన్ డివైజెస్ లకు పైగా విస్తరించిన పాపులర్ ఆపరేటింగ్ సిస్టం. గూగుల్ ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సరికొత్త వివరాలు రిలీజ్ చేసింది.

Android 16

ఆండ్రాయిడ్ 16 సరికొత్త డిజైన్ కలిగి ఉంటుంది, అని గూగుల్ తెలిపింది. అదే ‘Material 3 Expressive’ డిజైన్ మరియు ఈ డిజైన్ ను యూజర్ సౌకర్యం కోసం అందించినట్లు చెబుతోంది. ఇది ప్రస్ఫుటమైన కలర్స్, బోల్డ్ ఫాంట్, యూజర్ ఛాయిస్ ను బట్టి సరి చేసుకునే ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ మరియు కొత్త స్ప్రింగీ యానిమేషన్ వంటి వాటితో ఉంటుంది. యూజర్ కు మరింత ప్రీమియం మరియు ఎంగేజింగ్ ఎక్స్ పీరియన్స్ అందించడమే లక్ష్యంగా ఈ కొత్త డిజైన్ ను తీసుకు వచ్చినట్లు గూగుల్ టీమ్ చెబుతోంది.

ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం లో సెక్యూరిటీ కోసం గూగుల్ పెద్ద పీట వేసింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న స్కామ్ లను దృష్టిలో ఉంచుకొని వాటిని గుర్తించి నిలువరించేలా సహాయం చేసే AI ఆధారిత స్కామ్ డిటెక్షన్ మరియు హై రిస్క్ యూజర్స్ కోసం అధునాతన ప్రొటెక్షన్ సపోర్ట్ కూడా ఇందులో అందించినట్లు చెబుతున్నారు.

పెరుగుతున్న యూజర్స్ అవసరాల అనుకూలత కోసం లైవ్ అప్డేట్స్ ఫీచర్ ను మరింత సౌకర్యవంతంగా ఉండేలా అందించింది. ఎలాగంటే, రైడ్ షేర్, డెలివరీ మరియు నావిగేషన్ వంటివి లాక్ స్క్రీన్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మరియు నోటిఫికేషన్ షేడ్ వంటి ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ కోసం నిరంతరం నోటిఫికేషన్ అందిస్తుంది.

టెంపరరీ యాప్ పర్మిషన్ అనే కూట్ ఫీచర్ ను కూడా గూగుల్ అందించింది. ఈ ఫీచర్ తో యాప్ కు ఒక నిర్దిష్ట సమయం వరకు మాత్రమే పర్మిషన్ ఉండేలా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యాప్ కు లొకేషన్, వాయిస్ మరియు కెమెరా పర్మిషన్ ను మితంగా ఉండేలా సెట్ చేసుకోవచ్చు. ఇది యూజర్ ప్రైవసీ మరియు సెక్యూరిటీ మరింత పెంపొందిస్తుంది.

Also Read: Motorola Edge 50 Fusion పై రూ. 5,500 రూపాయల భారీ తగ్గింపు అందుకోండి.!

Find Hub ఫీచర్

కొత్త Find Hub ఫీచర్ ను కూడా ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం లో జత చేసింది. యూజర్ డివైజ్ లను కనుగొనడానికి వీలుగా Find My Device ఫీచర్ చాలా కాలంగా సహాయం సెహెస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ ఫీచర్ ను మరింత విస్తరించి ఫైండ్ హబ్ గా గూగుల్ అందిస్తోంది.

ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ను యూజర్ సేఫ్టీ & సెక్యూరిటీ తో పాటు యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మరింత పెంపొందించేలా ఉంటుందని గూగుల్ చెబుతోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :