Google Veo 3.1: ఇమేజ్ తో Vertical AI వీడియో క్రియేట్ చేసే కొత్త ఫీచర్ అందించిన గూగుల్!

Updated on 14-Jan-2026
HIGHLIGHTS

AI వీడియో మోడల్‌లో అతిపెద్ద మరియు అవసరమైన అప్‌డేట్ ను విడుదల చేసింది

కంటెంట్ కోసం ఇది చాలా గొప్ప అప్‌డేట్ అవుతుంది

మొబైల్ ఫార్మాట్ కోసం వీడియో ని క్రాప్ చేయాల్సిన అవసరం లేకుండా చేసింది గూగుల్

Google Veo 3.1: గూగుల్ తన Veo 3.1 జనరేటివ్ AI వీడియో మోడల్‌లో అతిపెద్ద మరియు అవసరమైన అప్‌డేట్ ను విడుదల చేసింది. కంటెంట్ కోసం ఇది చాలా గొప్ప అప్‌డేట్ అవుతుంది. ఎందుకంటే, అదేమిటంటే ఇమేజ్‌ను తీసుకొని ఇమేజ్ నుండి వర్టికల్ (9:16) వీడియోలు తయారు చేసే ఫీచర్ ను ఈ అప్‌డేట్ తో అందించింది. ఇది చాలా స్థిరత్వం కలిగిన వీడియో క్రియేట్ చేస్తుంది. ఇది యూజర్లకు యూట్యూబ్ షార్ట్స్ మరియు ఇంస్టాగ్రామ్ రీల్స్ వంటి మొబైల్ ఫస్ట్ ఫార్మాట్ కోసం రెడీ టూ యూజ్ వీడియోలు సృష్టించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Google Veo 3.1: కొత్త ఫీచర్స్ ఏమిటి?

ముందు కేవలం ఫుల్ స్క్రీన్ వీడియోలు మాత్రమే గూగుల్ వేయో 3.1 లో క్రియేట్ చేసే అవకాశం ఉండగా, ఇప్పుడు కొత్త అప్డేట్ తో 9:16 ఆఫ్సెట్ రేషియో లో వీడియోలను నేరుగా జనరేట్ చేస్తుంది. అంటే, షార్ట్ వీడియో లేదా మొబైల్ ఫార్మాట్ కోసం వీడియో ని క్రాప్ చేయాల్సిన అవసరం లేకుండా చేసింది.

ఇప్పటి వరకు వేయో లో క్రియేట్ చేసిన వీడియో మధ్యలో వచ్చే అక్షరాల రూపం మరియు బ్యాక్ గ్రౌండ్ మారడం వంటివి మెయిన్ ఇమేజ్‌తో కలిసిపోయే సమస్యలు ఉండేవి. అయితే, కొత్త అప్డేట్ తో ఈ సమస్యను గణనీయంగా తగ్గించినట్లు తెలిపింది. అంటే, చాలా స్పష్టమైన వీడియోలను క్రియేట్ చేసే సత్తా ఇప్పుడు వేయో 3.1 కలిగి వుంది.

Google Veo 3.1: వీడియో రిజల్యూషన్?

గూగుల్ వేయో 3.1 కొత్త అప్డేట్ తో 1080p నుంచి 4K రిజల్యూషన్ వరకు ఆప్షనల్ అప్ స్కేల్ చేసే అవకాశం అందించింది. ఇది బిగ్ స్క్రీన్ ప్రొఫెషనల్ డిస్ప్లే లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

పోర్ట్రైట్ ఫార్మాట్ లో వీడియోలు అందించాడని వీడియో క్రియేటర్ వీడియోలు షూట్ తీసి తర్వాత ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ లో కటింగ్ మరియు క్రాపింగ్ చేయాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు Veo 3.1 ద్వారా నేరుగా ఫోన్ ఫ్రెండ్లీ వీడియోలు రూపొందించడం మరింత సులభం చేసింది గూగుల్.

Also Read: Jio 2026: జియో యూజర్ల కోసం అందించిన 2026 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్.!

ఇక ఈ కొత్త ఫీచర్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే, గూగుల్ కొత్త అప్‌డేట్ తో మొబైల్ ఆప్టిమైజ్డ్ వీడియో క్రియేషన్‌ను కొత్త అంచులకు తీసుకెళ్తుంది. వర్టికల్ వీడియోలు, బెటర్ స్టోరీ టెల్లింగ్, మరియు 4K వరకు అప్‌ స్కేల్ చేయగల జబర్దస్త్ ఫీచర్లు కూడా కంటెంట్ క్రియేటర్లకు అందుతుంది. ఈ కొత్త అప్‌డేట్ తో AI పవర్ ని మరింత సృజనాత్మకంగా వినియోగించుకునేందుకు కంటెంట్ క్రియేటర్స్ తో పాటు సామాన్యులకూ అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :