భారీగా పెరిగిన బంగారం ధర..ఈరోజు రేటు ఎంతంటే..!!

Updated on 19-Apr-2022
HIGHLIGHTS

ఏప్రిల్ నెల ప్రారంభం నుండి బంగారం ధర పెరుగుతూ వచ్చింది

10 గ్రాముల బంగారం ధర 3000 వేల పైగా పెరిగింది

ఈరోజు బంగారం ధరల పైన ఒక లుక్ వేయండి

ఏప్రిల్ నెల ప్రారంభం నుండి బంగారం ధర పెరుగుతూ వచ్చింది. గత నెల క్లోజింగ్ తో  పోలిస్తే ప్రస్తుత బంగారం ధర 10 గ్రాముల ధర 3000 వేల పైగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర 22 క్యారెట్ బంగారం ధర 50 మార్కును టచ్ చేయగా,  24 క్యారెట్ స్వచ్చమైన బంగారం ధర 55 చేరువకు వచ్చి చేరింది. పెళ్లిల సీజన్ కావడంతో బంగారం ధర మరింతగా పెరగవచ్చని కూడా ఊహిస్తున్నారు. ఇక ఈరోజు బంగారం ధరల పైన ఒక లుక్ వేయండి.       

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గతవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,600 రూపాయలుగా ఉండగా, నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,850 రూపాయలుగా ఉంది. అలాగే, గతవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,380 గా ఉంది. అంటే, ఒక వారంలో 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా 1,000 రూపాయల వరకూ పెరిగింది.

ఈరోజు బంగారం ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,380 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,290 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,870 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,380 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,380 గా ఉంది.       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :