గత కొద్దిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు భారీగా తగ్గింది. గత వారం రోజులుగా బంగారం పెరుగుదలను నమోదు చెయ్యగా, ఈరోజు మాత్రం దారుణంగా పడిపోయింది. గత వారం రోజుల్లో 830 రూపాయల వరకూ పెరిగిన బంగారం ధర (10గ్రా) ఈరోజు ఏకంగా 1,050 రూపాయలు తగ్గింది. ఈరోజు 52,760 వద్ద ప్రారంభమయిన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్, 1,050 రూపాయలు క్రిందకు దిగి 51,710 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ ప్రధాన నగరాల్లో ఈ రోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దామా.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,360 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,400 రూపాయలుగా ఉంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర 960 రూపాయలు తగ్గింది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 గా ఉంది. ఆశ్చర్యకరంగా ఈరోజు దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,880 గా ఉంది.