ఈరోజు తగ్గిన బంగారం ధర .. ఈరోజు ధర ఎంతంటే..!!

Updated on 07-Jun-2022
HIGHLIGHTS

ఈ నెలలో బంగారం ధర మిశ్రమ ధోరణిని కనబరుస్తోంది

బంగారం ధర ఒక రోజు పెరిగితే మరొక రోజు రేటు తగ్గుతోంది

ఈ రోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో ఒక లుక్ వేద్దామా

ఈ నెలలో బంగారం ధర మిశ్రమ ధోరణిని కనబరుస్తోంది. ఈ నెల ప్రారంభం నుండి ఒక రోజు రేటు పెరిగితే మరొక రోజు రేటు తగ్గుతోంది. మొత్తంగా, గోల్డ్ మార్కెట్ దాదాపుగా ఒక దగ్గరే తిరుగుతోంది. క్లారిటీగా చెప్పాలంటే, ఈ నెల ప్రారంభంలో 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ 47,500 వద్ద ప్రారంభమవ్వగా, ఈరోజు తిరిగి మరలా అదే రేటుకు చేరుకుంది. ఈరోజు గోల్డ్ మార్కెట్ ని పరిశీలిస్తే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ 47,600 గా వుంది. అయితే, ఈ మధ్యలో ఇదే బంగారం ధర 48,100 వరకూ పెరుగుదలను కూడా నమోదు చేసింది. మరి ఈ రోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో ఒక లుక్ వేద్దామా.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,850 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,600 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930 వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 270 రూపాయలు తగ్గింది.

ఈరోజు బంగారం ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930 గా ఉంది. ఆశ్చర్యకరంగా ఈరోజు దేశంలోని అన్ని ఇతర నగరాలతో పాటుగా చెన్నైలో బంగారం ధర తక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,720 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,060 గా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :