ప్రస్తుతం బంగారం ధర తగ్గుముఖం పట్టింది. గత వారంతో పోలిస్తే ఈ వారం బంగారం ధర చాలా తక్కువయ్యింది. రష్యా-ఉక్రెయిన్ మద్య చెలరేగిన వివాదం మరియు యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్ తో సహా మన దేశంలో కూడా బంగారం ధర భారీ పెరుగుదలను చూసింది. అయితే, రోజు రోజుకు బంగారం ధర తగ్గుముఖం పట్టింది. బంగారం కొనాలనుకునే వారికీ ప్రస్తుతం అధిక బంగారం ధర నుండి కొంత ఊరట లభించింది.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గతవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 49,400 రూపాయలుగా ఉండగా, నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,450 రూపాయలుగా ఉంది. అలాగే, గతవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,890 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 గా ఉంది. అంటే, ఒక వారంలో 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా 2,000 రూపాయల వరకూ తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,7600 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,140 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,510 గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 గా ఉంది.