ఈనెల ప్రారంభం నుండి పెరిగిన బంగారం ధర ఈరోజు కొంచెం తగ్గింది. నిన్నటి రేటుతో పోలిస్తే ఈరోజు బంగారం 10 గ్రాముల ధర దాదాపు 700 వందల రూపాయలు తగ్గింది. ఈరోజు మార్కెట్లో 22 క్యారెట్ బంగారం 49,300 నుండి ప్రారంభమయింది. మొన్న అంటే 19 వతేది 50 వేల మార్కును టచ్ చేసింది. ఇక 24 క్యారెట్ స్వచ్చమైన బంగారం ధర ఈరోజు 53,620 నుండి ప్రారంభమయ్యింది. వాస్తవానికి, ఏప్రిల్ నెలలో 24 క్యారెట్ బంగారం ధర 50 వేల పైన నిలకడగా కొనసాగుతోంది. మరి ఈరోజు తెలుగు రాష్టాలతో సహా ప్రధాన నగరాల్లో ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గతనెలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (హైఎస్ట్) 49,800 రూపాయలుగా ఉండగా, నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ప్రారంభ ధర 49,150 రూపాయలుగా ఉంది. అలాగే, గతవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం (హైఎస్ట్) ధర రూ.54,330 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రారంభ ధర రూ.53,620 గా ఉంది. అలాగే, మిన్నటికి ఈరోజుకు కూడా 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా 700 రూపాయల వరకూ తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,780 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,690 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,200 గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,780 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,780 గా ఉంది.