బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గుతున్న బంగారం ధర..!!

Updated on 01-Jun-2022
HIGHLIGHTS

బంగారం ధర జూన్ నెల మొదలవుతూనే తగ్గు ముఖం పట్టింది

బంగారం మార్కెట్ ట్రెండ్ ఇప్పుడు మారుతున్నట్టు కనిపిస్తోంది

ఈ రెండు రోజుల్లోనే బంగారం దాదాపుగా 380 రూపాయల వరకూ తగ్గింది

మే నెల మధ్య నుండి పెరుగుతూ వచ్చిన బంగారం ధర జూన్ నెల మొదలవుతూనే తగ్గు ముఖం పట్టింది. అంటే, నిన్నటి వరకు బంగారం ఉన్న బంగారం మార్కెట్ ట్రెండ్ ఇప్పుడు మారుతున్నట్టు కనిపిస్తోంది. గడిచిన 15 రోజుల్లో బంగారం ధర దాదాపుగా 2,000 పైగా పెరుగుదలను చూసింది.  అయితే, నిన్నటి నుండి బంగారం ధర తరుగుధలను నమోదు చేస్తోంది. ఈ రెండు రోజుల్లోనే బంగారం దాదాపుగా 380 రూపాయల వరకూ తగ్గింది. ఇదే ట్రెండ్ ఎప్పటి వరకూ ఫాలో అవుతుందో వేచిచూడాలి. ఇక ఈరోజు బంగారం ధర పరిశీలిస్తే, 10 గ్రాముల బంగారం ధర 280 రూపాయల వరకూ తగ్గింది. ఈరోజు 52,100 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 280 రూపాయల తరుగుదలను నమోదు చేసి, 51,820 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దాం.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,750 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,500 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,820 వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 280 రూపాయలు తగ్గింది.

ఈరోజు బంగారం ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,820 గా ఉంది. ఆశ్చర్యకరంగా ఈరోజు దేశంలోని అన్ని ఇతర నగరాలతో పాటుగా చెన్నైలో బంగారం ధర తక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే,ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,820 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,820 గా ఉంది.      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :