రూటు మార్చిన బంగారం ప్రైస్ ట్రెండ్ .. ఈరోజు ధర ఎంతంటే..!!

Updated on 29-Dec-2022
HIGHLIGHTS

బంగారం ధర ప్రైస్ ట్రెండ్ ఈ వారం రూటు మార్చింది

ఎక్కువ వ్యత్యాసం బంగారం ధరలో కనిపించడం లేదు

బంగారం ఈ వరం కొనాలా లేదా అమ్మలా

ఈ నెల ప్రారంభం నుండి క్రిందకు దిగుతూ వచ్చిన బంగారం ధర ప్రైస్ ట్రెండ్, ఈ వారం రూటు మార్చింది. గత ప్రారంభం వరకూ కిందకు దిగుతూ వచ్చిన బంగారం ధర  సూచీలు, ఈవారం స్థిరంగా ఉన్నాయి. అంతేకాదు, మే 5 వ తేదీ నుండి 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 51 వేల రూపాయల చుట్టూనే తిరుగుతోంది. 100, 200 లకు మించి ఎక్కువ వ్యత్యాసం బంగారం ధరలో కనిపించడం లేదు. ఇక గత వారం రోజుల ట్రెండ్ ను పరిశీలిస్తే 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 51,500 నుండి 51,800 రుపాయల మద్యలో స్థిరంగా కొనసాగుతోంది. మరి ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎలా ఉన్నదో చూద్దాం.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ గత వారం ప్రారంభంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,200 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,500 రూపాయలుగా ఉంది. అలాగే, గత  వారం ప్రారంభంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,510 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రారంభ ధర రూ.51,810 గా ఉంది. అంటే, ఈ వారం మొత్తం బంగారం దాదాపుగా స్థిరంగా కొనసాగుతోంది. ఇక, ఈరోజు గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, 47,400 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మార్కెట్ ప్రస్తుతం 100 రుపాయలు పెరిగి, 47,500 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ప్రారంభ ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,810 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,590 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,000 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,810 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,810 గా ఉంది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :