చాలా కాలంగా పెరుగు వస్తున్న బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టింది. గత నెల నుండి బంగారం ధర భారీ పెరుగుదల వైపుగా దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవలి కాలంలో వరుసగా రెండు రోజులు సూచీలు క్రిందకు దిగడం ఇదే మొదటిసారి. బంగారం ధర ఒక్కసారిగా భారీ తరుగుదలను నమోదు చేయ్యక పోయినా, స్వల్పంగా క్రిందకు దిగజారింది. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎలా కొనసాగుతోందో తెలుసుకోండి.
Gold Price Update:
నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,450 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర 150 రూపాయలు క్రిందకు దిగి, రూ.51,300 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, రూ.56,1300 రూపాయల నుండి రూ.55,960 రూపాయల వద్దకు చేరుకుంది.
ఈరోజు బంగారం ధర
ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,960 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,960 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,100 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,050 గా ఉంది.
సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.