నాలుగు నెలల కనిష్ఠానికి చేరుకున్నబంగారం ధర..!!

Updated on 14-Jul-2022
HIGHLIGHTS

గత 10 రోజులుగా బంగారం ధర 4 నెలల కనిష్ఠానికి చేరుకుంది

మార్కెట్ లో గోల్డ్ ధరలు ఆశాజనకంగా ఉన్నాయి

ఇప్పటికీ గోల్డ్ రేట్ కొనుగోలుదారులకు లాభదాయకంగానే వుంది

గత 10 రోజులుగా బంగారం ధర 4 నెలల కనిష్ఠానికి చేరుకుంది. ఈ పదిరోజులు కూడా బంగారం కొనాలని చూసే వారికి మార్కెట్ లో గోల్డ్ ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే, ఈరోజు స్వల్పంగా గోల్డ్ మార్కెట్ సూచీలు పైకి చూశాయి. తులానికి 210 రూపాయలు స్వల్ప పెరుగుదలను బంగారం మార్కెట్ ఈరోజు చూసింది. అయితే, ఇప్పటికీ కూడా గోల్డ్ రేట్ కొనుగోలుదారులకు లాభదాయకంగానే వుంది. మొత్తంగా 10 రోజుల్లో బంగారం మార్కెట్ కనిష్ఠానికే అంటిపెట్టుకొని   తిరిగితోంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలు మరియు దేశ రాజధానిలో బంగారం ధరలు చూద్దామా.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,700 రూపాయలుగా ఉండగా, ఈరోజు 200 రూపాయలు పెరిగి 46,700 రూపాయల వద్ద నిలిచింది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 210 రూపాయలు పెరిగి రూ.51,160 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే జైపూర్ లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు జైపూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,310 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :