గత వారం మొత్తం భారీ పతనాన్ని చూసిన బంగారం మార్కెట్, ప్రస్తుతం స్థిరంగా వుంది. ఇప్పటికి కొనుగోలుదారులకు లాభదాయకంగానే గోల్డ్ మార్కెట్ కనిపిస్తోంది. ఈరోజు కూడా గోల్డ్ రేటులో ఎటువంటి హెచ్చు తగ్గులు నమోదు కాకపోవడం విశేషం. అయితే, గతవారంలో మాత్రం బంగారం 1,360 రూపాయల భారీ పతనాన్ని చూసింది. ఇక ఈరోజు బంగారం మార్కెట్ ని చూస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం 51,210 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలు మరియు దేశ రాజధానిలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
ఈరోజు మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,950 రూపాయలుగా వుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, రూ.51,210 వద్ద కొనసాగుతోంది.
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,210 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,210 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,210 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే జైపూర్ లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు జైపూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,360 గా ఉంది.
ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here