ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ అందిస్తూ జియో తన కస్టమర్లను ఆకట్టుకుంటోంది. రెగ్యులర్ అన్లిమిటెడ్ ప్లాన్స్ తో పాటుగా మంచి డేటా ప్లాన్స్ కూడా జియో అఫర్ చేస్తోంది. ఎక్కువ డేటా అవసరం వున్న జియో కస్టమర్ల కోసం అనువైన డేటా ప్లాన్స్ చాలానే వున్నాయి. అయితే, 240GB హై స్పీడ్ డేటా అందించే ఈ Jio ప్లాన్ గురించి మీకు తెలుసా?
జియో యొక్క డేటా ప్లాన్స్ కేవలం 11 రుపాయల్ నుండి మొదలవుతాయి. అయితే, ఎక్కువ లాభాలనిచ్చే ప్లాన్స్ 499 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. ఈ ప్లాన్స్, 399 రూపాయల విలువ గల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తాయి. అయితే, వీటిలో 1206 రూపాయల డేటా ప్లాన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ తో పాటుగా నెలకు 40GB తో 6 నెలకు మొత్తంగా 240GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది.
ఇక జియో లేటెస్ట్ బెస్ట్ అఫర్ విషయాని వస్తే, జియో కొత్త జియోఫోన్ 2021 ఆఫర్ ను ప్రకటించింది. దీనితో కొత్త జియోఫోన్ తో ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి.
కేవలం రెండు సంవత్సరాలకు మాత్రమే కాదు, రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ గా రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు 2 జిబి హై-స్పీడ్ డేటా ఉంటాయి