Gemini for Home : ఇక ఇంటి స్మార్ట్ పరికరాల కోసం కూడా జెమినీ వస్తోంది.!

Updated on 03-Sep-2025
HIGHLIGHTS

గూగుల్ హోమ్ ఇప్పటికే ఇంటి భాగస్వామిగా మారింది

Gemini for Home కొత్త మ్యాజిక్ చేస్తుంది

ఇది ప్రస్తుతం నడుస్తున్న గూగుల్ అసిస్టెంట్ కంటే చాలా అడ్వాన్స్ గా ఉంటుంది

Gemini for Home: గూగుల్ హోమ్ ఇప్పటికే ఇంటి భాగస్వామిగా మారింది మరియు ఇంట్లోని అన్ని డివైజ్ లను నడిపించే నావికుడిగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మరింత శక్తి చేకూరుతోంది. ఎందుకంటే, గూగుల్ జెమినీ ఫర్ హోమ్ తో గూగుల్ ఇప్పుడు ఈ కొత్త మ్యాజిక్ చేస్తుంది. Made by Google 2025 నుంచి గూగుల్ ముందుగా ప్రకటించిన విధంగా గూగుల్ ఫర్ హోమ్ కార్యక్రమాన్ని ఇప్పుడు మరింత తీసుకువెళుతోంది. గూగుల్ యొక్క అత్యాధునిక AI సహాయకుడిగా ఇక జెమినీ కూడా స్మార్ట్ హోమ్ పరికరాల్లో ఉంటుంది.

Gemini for Home : ఏమిటి ఇది?

గూగుల్ ఫర్ హోమ్ అనేది గూగుల్ స్మార్ట్ స్పీకర్ లలో గూగుల్ తీసుకు వచ్చే కొత్త అప్డేట్ మరియు ఇది ప్రస్తుతం నడుస్తున్న గూగుల్ అసిస్టెంట్ కంటే చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. ఎందుకంటే, ఇందులో గూగుల్ యొక్క లేటెస్ట్ జెమినీ లైవ్ ను అందిస్తుంది. కాబట్టి ఈ డివైజ్ మరింత గొప్పగా పనులు నిర్వహించే శక్తిని మరియు తెలివిని కలిగి ఉంటుంది. గూగుల్ కొత్త ఫోన్ల లాంచ్ కోసం అందించిన అప్డేట్ తో ఆగస్టు 20వ తేదీ ఈ అప్ కమింగ్ డివైజెస్ మరియు AI అసిస్టెంట్ గురించి వెల్లడించింది. అయితే, ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ తో మరోసారి గూగుల్ ఫర్ హోమ్ వార్తల్లో నిలిచింది.

Also Read: ఎన్ని రోజులు రీఛార్జ్ చేయకపోతే SIM Card డీయాక్టివేట్ అవుతుందో తెలుసా.!

ఏమిటి Gemini for Home కొత్త అప్డేట్?

గూగుల్ యొక్క మేడ్ బై గూగుల్ అఫీషియల్ X అకౌంట్ నుంచి నిన్న జెమినీ ఫర్ హోమ్ కొత్త అప్డేట్ ను గూగుల్ అందించింది. ఈ అప్డేట్ తో జెమినీ ఫర్ హోమ్ మరోసారి వార్తల్లో నిలిచింది. అదేమిటంటే, 2025 అక్టోబర్ 1వ తేదీ జెమినీ లైవ్ సపోర్ట్ కలిగిన కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేయనున్నట్లు ఇందులో తెలిపింది. ఇందులో జెమినీ ఈజ్ కమింగ్ టు గూగుల్ హోమ్ అని టీజింగ్ చేస్తోంది. ఇందులో ఉన్న ప్రోడక్ట్ కెమెరా అని క్లియర్ గా అర్థం అవుతోంది.

అంతేకాదు, ఈ అప్ కమింగ్ ప్రోడక్ట్ అప్డేట్ కోసం సైన్ అప్ చేయమని కూడా లింక్ ప్రొవైడ్ చేసింది. ఇది గూగుల్ యొక్క నెస్ట్ స్పీకర్ కావచ్చని అంచనా వేస్తున్నారు. లేదంటే, గూగుల్ యొక్క కొత్త నెస్ట్ స్పీకర్ కావచ్చేమో అని కూడా ఊహిస్తున్నారు. కానీ గూగుల్ మాత్రమే ఈ ప్రోడక్ట్ లేదా ఫీచర్ గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. మరి ఈ కొత్త ప్రోడక్ట్ ఏమై ఉంటుందో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :