ఇక గూగుల్ ఫొటోస్ లో కూడా AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్ Nano Banana వచ్చేస్తోంది.!

Updated on 14-Oct-2025
HIGHLIGHTS

గూగుల్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్ Nano Banana ఇప్పుడు గూగుల్ ఫొటోస్ లోకి కూడా వచ్చి చేరుతోంది

గూగుల్ సెర్చ్ మరియు NotebookLM లోకి కూడా వచ్చి చేరుతుందని చెబుతున్నారు

ఎటువంటి ఎడిటింగ్ ఎక్స్ పీరియన్స్ అవసరం లేకుండానే జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ తో సూపర్ ఇమేజ్ క్రియేట్ చేసుకునే అవకాశం

యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురించి చేసిన గూగుల్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్ Nano Banana ఇప్పుడు గూగుల్ ఫొటోస్ లోకి కూడా వచ్చి చేరుతోంది. కేవలం గూగుల్ గూగుల్ ఫొటోస్ లో మాత్రమే కాదు గూగుల్ సెర్చ్ మరియు NotebookLM లోకి కూడా వచ్చి చేరుతుందని చెబుతున్నారు. గూగుల్ జెమినీ లో అందించిన ఈ ఫీచర్ తో గొప్ప క్రియేటీవ్ ఇమేజస్ ని జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా గొప్ప పోర్ట్రైట్ ఇమేజస్ గా క్రియేట్ చేసుకోవచ్చు.

Nano Banana on Google Photos

Gemini nano Banana ఫోటో ఎడిటింగ్ అండ్ ఇమేజ్ క్రియేట్ ఫీచర్ గురించి తెలియని వారుండరు. ఈ కొత్త ఫీచర్ వచ్చిన తర్వాత అద్భుతమైన ఫోటో ఎడిటింగ్ సపోర్ట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ తో గిబిలీ స్టైల్ ఇమేజ్ లతో పాటు రెట్రో 4K పోర్ట్రైట్ వంటి చాలా ఇమేజ్ ఎడిటింగ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చాయి. దీనికోసం ఎటువంటి ఎడిటింగ్ ఎక్స్ పీరియన్స్ అవసరం లేకుండానే జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ తో సూపర్ ఇమేజ్ క్రియేట్ చేసుకునే అవకాశం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఇప్పుడు గూగుల్ ఫొటోస్ ని చేరుకోనున్నది.

గూగుల్ జెమినీ నానో బనానా ఫీచర్ తో ఇప్పటి వరకు 5 బిలియన్ కంటే ఎక్కువ ఇమేజెస్ ను యూజర్లు క్రియేట్ చేసినట్లు చెబుతున్నారు. అటువంటి ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్ ఇప్పుడు గూగుల్ ఫోటో యాప్ గూగుల్ ఫోటోస్ కి సి చేరితే యూజర్ కోరుకునే అద్భుతమైన ఫోటోలు గూగుల్ ఫొటోస్ యాప్ లోనే క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు గూగుల్ నానో బనానా ఫీచర్ గూగుల్ Lens మరియు AI Mode తో గూగుల్ సెర్చ్ కోసం ఇంటిగ్రేట్ చేయబడింది. ఇదే ఫీచర్ ను గూగుల్ ఫోటోస్ తో కూడా జత చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు కూడా చెబుతన్నారు.

NotebookLM లో నానో బనానా వీడియో ఓవర్ వ్యూస్ ని ఎన్హెన్స్ చేస్తుంది. దీనికోసం ఇందులో 6 కొత్త విజువల్ స్టైల్ ని ఆఫర్ చేస్తోంది. ఇందులో వాటర్ కలర్ మరియు అనిమ్ వంటి స్టైల్స్ కూడా అందించింది. ఇది మీ నోట్స్ ఉపయోగించి ఊహాజనిత ఫోటోలు జనరేట్ చేసే శక్తిని కలిగి ఉంటుందని కూడా చెబుతున్నారు.

Also Read: 900W Dolby Soundbar అమెజాన్ సేల్ భారీ డిస్కౌంట్ తో 12 వేలకే లభిస్తోంది.!

ఇందంతా చూస్తుంటే, గూగుల్ ఫొటోస్ యూజర్లు వారి ఇమేజ్ లకు కొత్త రూపం జోడించే అవకాశం దక్కుతుంది. ఇదే కాదు వీడియో లను మరింత ఎన్హెన్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ కొత్త ఫీచర్ ఎప్పటి వరకు గూగుల్ ఫోటోస్ లో అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :