Gemini AI fails twice at made by google event live demonstration
చాలా కాలంగా గూగుల్ ఊరిస్తూ వచ్చిన Google 9 Series స్మార్ట్ ఫోన్ లను ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ ఎల్ మరియు గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ నాలుగు ఫోన్ లను విడుదల చేసింది. అయితే, ఈ సిరీస్ లాంచ్ ఈవెంట్ లో గూగుల్ యొక్క ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అస్త్రం Gemini AI పని చేయకుండా మొరాయించింది. ఏదో ఒక్కసారి జరిగింది కదా పోనీలే అనుకోకండి, ఇది రెండు సార్లు పని పనిచేయడం మానేసింది.
గూగుల్ యొక్క ప్రతిష్టాత్మకమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ Gemini AI తో గూగుల్ 9 సిరీస్ ఫోన్ లను తీసుకువస్తున్నట్లు చాలా గొప్పగా తెలిపింది. అయితే, ఈ లైవ్ ఈవెంట్ లో ఈ ఫోన్ లతో Gemini ని టెస్ట్ చేస్తుండగా ఏకంగా రెండు సార్లు ఫెయిల్ అయ్యింది మరియు లైవ్ ఈవెంట్ లో ఇబ్బందికరమైన క్షణం గా కనిపించింది. అన్నీ సవ్యంగా ఉంటేనే వంకలు వెతికే సోషల్ మీడియా యూజర్లు ఈ విషయాన్ని వదిలి పెడతారా? ఈ విషయాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేసే పనిలో పడ్డారు.
అయితే, వాస్తవానికి ఇటీవల జరిగిన గూగుల్ ఈవెంట్ లో కూడా Gemini ప్రతిభ మరియు శక్తి సామర్ధ్యాలు తెలిపేలా కొత్త ఫీచర్స్ ను కూడా వివరించింది. ఇది మాత్రమే కాదు Gemini చాలా శక్తివంతమైనది మరియు గుట్టల కొద్దీ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఇది అడిగిన వెంటనే కావలసిన సమాచారం మరియు పనులను చేసే సత్తాను కలిగి ఉంటుంది.
Also Read: Google Pixel 9 Pro మరియు Pro XL లను భారీ ఫీచర్స్ తో విడుదల చేసిన గూగుల్.!
లాంచ్ ఈవెంట్ లైవ్ సమయంలో ఇది అనుకోని జరిగిన తప్పిదం గా భావించాలే తప్ప ఇది మరొకటి కాదని మరికొందరు హితవు పలుకుతున్నారు. Gemini శక్తి గురించి చెబుతూ ఫోన్ లాక్ చేసి ఉన్నప్పుడు కూడా Gemini Live ని ఉపయోగించవచ్చని గూగుల్ తెలిపింది.