గంగుభాయి కతియావాడి ఈ OTT ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది..!!

Updated on 11-May-2022
HIGHLIGHTS

గంగుభాయి కతియావాడి OTT ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది

ఈ సినిమా నిజమైన కథ ఆధారంగా రూపొందించబడింది

గంగూబాయి కతియావాడి బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ సాధించింది

అలియా భట్ అద్భుతమైన నటన కనబర్చిన గంగుభాయి కతియావాడి సినిమా ఈరోజు నుండి OTT ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా ఈరోజు నుండి Netflix లో స్ట్రీమ్ అవుతోంది. సంజయ్ లీలా బన్సాలీ చిత్రం గంగూబాయి కతియావాడి బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ సాధించింది. సినిమా థియేటర్లలో ఈ సీమ చూడడం మిస్సైన వారు ఈరోజు నుండి Netflix లో చూడవచ్చు.

ఈ సినిమా ప్రేమికుని చేటిలో మోసగించబడి, వేశ్యా వృత్తిలోకి బలవంతంగా నెట్టబడి చివరకు గంగుభాయి గా మరిన ఒక అమ్మాయి జీవితం గురించి చెబుతుంది. అంతేకాదు, ఈ సినిమా గంగూబాయి హర్జీవందాస్ యొక్క నిజమైన కథ ఆధారంగా రూపొందించబడింది.

ఈ సినిమా కథ హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం నుండి ప్రేరణ పొందింది. ఈ చిత్రంలో గంగ (ఆలియా) ను ప్రేమికుడు రామ్నిక్ లాల్ మోసగించి బలవంతంగా వ్యభిచారంలోకి దించుతాడు, ఆ తర్వాత ఆమె గంగూబాయి మారుతుంది. ఈ సినిమా కోసం అలియా భట్ 20 కోట్లు పారితోషికం అందుకుందని, అలాగే ఈ సినిమాలో అతిధి పాత్ర కోసం అజయ్ దేవగన్ 11 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :