Former Google X executive Mo Gawdat warned that AI could collapse middle-class by 2027
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దెబ్బకు ఇప్పటికే చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోయి ఇళ్లకు చేరుకోగా, మరి కొంతమంది ఇదే దారిలో ఉన్నట్లు కొత్త రిపోర్ట్ లు చెబుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిస్థాయిలో విజృంభించకుండా ఇంత జరిగితే ముందు ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అని చెవులు కోరుకుంటున్న వారికి మాజీ Google ఎగ్జిక్యూటివ్, Mo Gawdat పిడుగులాంటి వార్త ఒకటి చెవిలో వేశారు. AI దెబ్బకు 2027 నాటికి మధ్యతరగతి సంక్షోభం తప్పదని ఆయన ఒక హెచ్చరిక చేశారు. వింటుంటే మీకు కూడా కొంచెం వణుకు పుట్టింది కదా, మనం మధ్య తరగతి వాళ్ళం కాదండి ఆమాత్రం ఉంటుంది.
మాజీ Google ఎగ్జిక్యూటివ్, మో గౌడట్ Google X ప్లాట్ ఫామ్ లో హెడ్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీ గా పనిచేశారు. ఆయన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మధ్య తరగతి వారికి అతి సున్నితమైన హెచ్చరిక జారీ చేశారు. AI దెబ్బకు 2027 నాటికి మధ్యతరగతి వారికి సంక్షోభం తప్పదు అని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు, రానున్న మానవుల జీవితాల్లో ఒక 15 సంవత్సరాలు నరకం లాంటి పరిస్థితులు నెలకొంటుంది, అని కూడా ఆయన వెల్లడించారు.
మో గౌడట్, ఏదో మాట వరసకు లేదా ప్రజలను భయపెట్టడానికి ఈ మాట చెప్పలేదు. ఆయన లెక్కలు వేసి చెబుతున్నట్లు క్లియర్ గా అర్థం అవుతోంది. AI టూల్స్ మరింత విస్తరించడం మరియు మరింత ఖచ్చితత్వంతో మనుషుల వర్కింగ్ అవర్స్ తగ్గిపోతున్నాయి. దీంతో ఈ సమయాన్ని సేవ్ చేసే పనిలో కంపెనీలు ఉద్యోగులను కుదిస్తున్నాయి. ఈ దెబ్బకు 10 మందిలో నాలుగు ఉద్యోగాలు కోల్పోతున్నారు.
ఇప్పటికే, AI ఆధారిత టూల్స్ దెబ్బకు కంటెంట్ రైటర్స్, డిజైనర్లు, డెవలపర్లు మరియు ఎడిటర్స్ అవసరం తగ్గిపోయింది. అంతేకాదు, AI కొన్ని సెక్టార్ లలో మనుషుల కంటే వేగంగా మరియు మరింత కచ్చితంగా ఉండటంతో ఆ సెక్టార్ లో ఉద్యోగాలు చెక్కులో పడ్డాయి. ఈ కాబట్టి, ఈ సెక్టార్ లో పని చేసే మధ్య తరగతి వ్యక్తుల ఉద్యోగాలు ముప్పులో పడే అవకాశం ఉంటుంది.
Also Read: Realme P Series 5G అప్ కమింగ్ ఫోన్స్ కోసం టీజింగ్ మొదలు పెట్టిన కంపెనీ.!
ఇదే విషయాన్ని లెక్కలు వేసి చెబుతూ రానున్న రోజుల్లో ఇలా జరిగే అవకాశం ఉందని ఆయన ఊహిస్తున్నారు. అయితే, ఇవన్నీ లెక్కలు వేసి చెబుతున్న విషయాలు మాత్రమే అని గమనించాలి.