Flipkart Republic Day Sale 2026 Date Announced Discounts Offers on Smartphone Laptops
భారీ ఆఫర్స్ తో Republic Day Sale ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు అనౌన్స్ చేసింది. 2026 భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సేల్ అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సేల్ నుంచి అనేక వస్తువులు భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తాయని కూడా ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మరి ఈ సేల్ నుంచి ఎటువంటి డీల్స్ ఆఫర్ చేస్తుందో తెలుసుకుందాం పదండి.
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ ప్లస్ మరియు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ మెంబెర్స్ ఒక రోజు ముందుగా ఈ బిగ్ సేల్ యాక్సెస్ అందుకుంటారు. అంటే, ఫ్లిప్ కార్ట్ ప్లస్ మరియు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ మెంబెర్స్ కి జనవరి 16 నుంచి ఈ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ సేల్ కోసం బ్యాంక్ పార్ట్నర్ గా HDFC బ్యాంక్ ఉంటుంది. అందుకే, ఈ సేల్ నుంచి HDFC క్రెడిట్ కార్డు తో వస్తువులు కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ అనేక ప్రొడక్ట్స్ మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. స్మార్ట్ ఫోన్ లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచీలు, ఇయర్ బడ్స్ మరియు టాబ్లెట్ వంటి వాటిపై భారీ డీల్స్ అందుకోవచ్చని చెబుతున్నారు. గత సేల్ నుంచి అందుకున్న డీల్స్ ను బట్టి చూస్తే, ఈ అప్ కమింగ్ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్స్ మంచి డిస్కౌంట్ తో లభించే అవకాశం ఉంటుంది. ఇదే కాదు సౌండ్ బార్స్ పైన కూడా జబర్దస్త్ ఆఫర్స్ అందుకోవచ్చు.
ఈ అప్ కమింగ్ సేల్ నుంచి అందించే డీల్స్ మరియు ఆఫర్స్ అప్డేట్ ను త్వరలోనే ఫ్లిప్ కార్ట్ ప్రకటించే అవకాశం వుంది. ఈ సేల్ కొత్త అప్డేట్స్ తో మళ్ళి కలుద్దాం.