ఈరోజు అర్ధరాత్రి నుండి మొదలవనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్!!

Updated on 15-Mar-2022

బిగ్ డీల్స్ మరియు ఆఫర్లతో ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు అర్ధరాత్రి నుండి ప్రారంభమవుతుంది. ఈ సేల్ ను మార్చి12 నుండి మార్చి16 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ లేటెస్ట్ సేల్ నుండి లేటెస్ట్ గా విడుదలైన Realme C35 స్మార్ట్ ఫోన్, Infinix X3 స్మార్ట్ టీవీలు వంటి మరిన్ని ప్రోడక్ట్స్ మంచి ఆఫర్లతో మొదటిసారిగా సేల్ కి రానున్నాయి. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. అందుకే, SBI క్రెడిట్ కార్డ్స్ తో వస్తువులను కొనుగోలుచేసే కొనుగులుదారులకు సేల్ డిస్కౌంట్ తో పాటుగా 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

 బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్ పైన 80% వరకూ మరియు టీవీల పైన 75% వరకూ భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు కూడా టీజింగ్ చేస్తోంది. ఈ  సేల్ గురించి టీజింగ్ చేస్తున్న ద్వారా మరిన్ని వివరాలను చూడవచ్చు. ఈ సేల్ నుండి నుండి స్మార్ట్ వాచ్ లను గరిష్టంగా 60% డిస్కౌంట్ తో, ల్యాప్ టాప్ ల పైన కూడా గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపించింది.

అలాగే, రియల్ మీ నిన్న ప్రకటించిన రియల్ మీ 9 సిరీస్ 5జి సిరీస్ స్మార్ట్ ఫోన్లు Realme 9 5G మరియు Realme 9 5G స్పీడ్ ఎడిషన్ కూడా మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ రియల్ మీ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు మార్చి 14 న మధ్యాహ్నం 12 గంటలకి మొదటి సేల్ జరుగుతుంది. ఈ ఫోన్ల పైన కూడా SBI బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ వర్తిస్తుంది. ఈ ఫోన్ ఫోన్లను SBI కార్డ్స్ ద్వారా కొనేవారికి 1500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఇక కొనుగోలుదారులు ఎక్కువగా లాభాలను అందుకునే ఆఫర్ల గురించి చూస్తే, స్మార్ట్ ఫోన్స్, అప్లయన్సెస్ మరియు ఫ్యాషన్స్ పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఈ డీల్స్ కాకుండా క్రేజీ డీల్స్, రష్ అవర్స్, tick tock డీల్స్ మరియు మరిన్ని ఆఫర్లను కూడా అందించనున్నట్లు వెల్లడించింది.                              

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :