ఫ్లిప్‌కార్ట్ మరొకసారి తన Big Saving Days సేల్ ను ప్రకటించింది. కొత్త సంవత్సరం మరియు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 16 నుండి డిసెంబర్ 21 వరకూ నిర్వహించనుంది. ఈ సేల్ ను మరొకసారి భారీ ఆఫర్లు మరియు డీల్స్ తో తీసుకువస్తునట్లు ప్రకటించింది. ఈ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పైన భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది. అంతేకాదు, ఈ సేల్ నుండి స్మార్ట్ ఫోన్స్ మరియు టీవీలతో సహా అనేక ప్రోడక్ట్స్ పైన బెస్ట్ డీల్స్ కూడా ఇవ్వనున్నట్లు టీజ్ చేస్తోంది.
ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ డిసెంబర్ 16వ తేదీ నుండి 21వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామిగా నిర్వహిస్తోంది. కాబట్టి, SBI క్రెడిట్ కార్డ్ తో వస్తువులను కొనుగోలుచేసే కస్టమర్లకు 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్ నుండి 'You Have Won A Coupon' అనే అఫర్ ను కూడా అందించింది. దీనితో, ఈ సేల్ నుండి చేసే మొదటి ఆర్డర్ పైన 30% అధనపు డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది.
ఇక కొనుగోలు దారులు ఎక్కువగా లాభాలను అందుకునే ఆఫర్ల గురించి చూస్తే, స్మార్ట్ ఫోన్స్, LED టీవీలు మరియు అప్లయన్సెస్ పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేయబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ పైన గరిష్టమైన డిస్కౌంట్ అఫర్ చేనునట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన మైక్రోసైట్ పేజ్ ద్వారా ప్రకటించింది.