Flipkart Big Diwali Sale: ఈ దీపావళి కోసం అతిపెద్ద ధమాకా సేల్

Updated on 24-Oct-2020
HIGHLIGHTS

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ ద్వారా ఈ పండుగ సీజన్ లో మంచి ఆఫర్లను అందించింది.

దీపావళి పండుగ కోసం అతిపెద్ద సెల్ గా Flipkart Big Diwali Sale ను ఈరోజు భారీ ఆఫర్లతో ప్రకటించింది.

ఈ సేల్ అక్టోబర్ 29 న మొదలవుతుంది మరియు నవంబర్ 4 వరకూ కొనసాగుతుంది..

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ ద్వారా ఈ పండుగ సీజన్ లో మంచి ఆఫర్లను అందించింది. అయితే, ఈ ఫెస్టివల్ సేల్ ముగిసిన వెంటనే దీపావళి పండుగ కోసం అతిపెద్ద సెల్ గా Flipkart Big Diwali Sale ను ఈరోజు భారీ ఆఫర్లతో ప్రకటించింది. ఈ సేల్ గురించి అందించిన టీజింగ్ పోస్టర్ లో "దివాళీ కా సబ్ సే బడా ధమాఖా" అని  చెబుతోంది. అంటే, ఈ దీపావళి కోసం అతిపెద్ద ధమాఖా సేల్ నిర్వహించనున్నట్లు చెబుతోంది. ఈ సేల్ అక్టోబర్ 29 న మొదలవుతుంది మరియు నవంబర్ 4 వరకూ కొనసాగుతుంది.  

భారీ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ మరియు మరిన్ని లాభాలను వినియోగదారులు అందుకునే అవకాశం ఈ సేల్ ద్వారా తీసుకొస్తోంది. ఇప్పటికే, ఒక సేల్ నిర్వహించిన  ఫ్లిప్ కార్ట్  దివాళీ పండుగ కోసం ఈ సేల్ ని గురించి అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ సేల్ ద్వారా ఇవ్వనున్న ఆఫర్లు, డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని వివరాలను కూడా చూపిస్తోంది.

ఇక ఈ సేల్ ద్వారా ఇవ్వనున్న ఆఫర్ల విషయానికి వస్తే, Flipakrt ప్రస్తుతం చేస్తున్న టీజింగ్ పరిశీలిస్తే, TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్ అందించే అవకాశం వుంది. ఇక మొబైల్ ఫోన్ల విషయంలో కూడా మంచి ఆఫర్లను ప్రకటించవచ్చు. ఎందుకంటే, మొబైల్ ఫోన్ల పైన అన్ని ప్రధాన బ్యాంక్స్ నుండి No cost EMI,  మొబైల్ ప్రొటక్షన్ మరియు బెస్ట్ Exchange వంటి ఆఫర్లను ఇప్పటికే ప్రకటించింది.

అలాగే, ఎప్పటిలాగానే మహా ప్రైస్ డ్రాప్, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ ని Axis బ్యాంక్ యొక్క భాగస్వామ్యంతో తీసుకొస్తోంది కాబట్టి, Axis క్రెడిట్, డెబిట్ మరియు EMI ద్వారా వస్తువులను కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. ఇంకా మరిన్ని ఆఫర్లు మరియు  డీల్స్ తో పాటుగా కొత్త లాంచ్ ఆఫర్లను కూడా వెల్లడించవచ్చు.                                                    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :