Flipkart Big Billion Days SALE announced
Flipkart Big Billion Days: భారతదేశ ప్రజలకు అతి పెద్ద పండుగలైన దసరా మరియు దీపావళి కోసం ప్రత్యేకమైన ఆఫర్స్ తో పండుగ సీజన్ సేల్ దేశం మొత్తం జరుగుతుంది. ఈ పండుగ సీజన్ సేల్ ను ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్ కూడా ఆఫర్ చేస్తాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నా. ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు దసరా పండుగ కోసం అందించే అతిపెద్ద ప్రత్యేకమైన సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ను అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సేల్ కోసం ఇప్పటి నుంచే టీజింగ్ మొదలు పెట్టింది.
2025 దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 ని అనౌన్స్ చేసింది. ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్ నుంచి మైక్రో బ్యానర్ మరియు ఫుల్ మైక్రో సైట్ పేజి అందించి కూడా ఈ సేల్ గురించి టీజింగ్ చేస్తోంది. అయితే, ఈ సేల్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. కాని, ఈ సేల్ సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అందించే ఆఫర్ గురించి కూడా ఇలా ప్రకటించలేదు. అయితే, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ, సౌండ్ బార్, ఇయర్ బడ్స్ వంటి మరిన్ని ప్రోడక్ట్స్ పై గొప్ప డీల్స్ అందించే అవకాశం ఉంటుంది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకమైన డీల్స్ మరియు ఆఫర్లు అందించే అవకాశం కూడా ఉండవచ్చు.
ఫ్లిప్ కార్ట్ ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ ను Axis మరియు ICICI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకు వస్తోంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ రెండు బ్యాంక్ కార్డ్ తో వస్తువులను కొనుగోలు హన్స్ వారికి 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. దసరా పండుగ కోసం కొత్త వస్తువులు కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ గుడ్ న్యూస్ అందించింది.
Also Read: Realme 15T టాప్ ఫీచర్లు మరియు ప్రైస్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!
2025 దసరా పండుగ కోసం కొత్త వస్తువులు మంచి డిస్కౌంట్ ప్రైస్ లేదా పండుగ ఆఫర్స్ తో కొనడానికి ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా పండుగ లాంటి వార్త అవుతుంది.