ఫ్లిప్‌కార్ట్ యొక్క ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 అక్టోబర్ 16 న ప్రారంభం కానుంది. ఈ సేల్, అక్టోబర్ 16 నుండి మొదలై అక్టోబర్ 21 తో ముగుస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో, మీరు బెస్ట్ డిస్కౌంట్స్ మరియు ఆఫర్లను పొందవచ్చు. ప్రస్తుతానికి, అన్ని డీల్స్ గురించి ఫ్లిప్‌కార్ట్ ఇంకా వెల్లడించనప్పటికీ, కొన్ని ఆఫర్లను మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో చూడవచ్చు.
అధనంగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 కోసం, కంపెనీ SBI ని కూడా భాగస్వామిగా చేసుకుంది. అంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు, ఈ సెల్‌లో SBI కార్డులతో కొనుగోలు చేసే వస్తువుల పైన 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా, ఇంతకుముందు చాలాసార్లు వెల్లడించినట్లుగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 లో కూడా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ చందాదారులు ముందగా ఈ సేల్ యాక్సెస్ అందుకుంటారు.
SBI కార్డుల యొక్క డిస్కౌంట్ కాకుండా, ప్రజలు ఫ్లిప్‌కార్ట్ లో ఎటువంటి వడ్డీ లేకుండా No Cost EMI ఎంపికలతో కూడా వస్తువులను కొనవచ్చు. ఇది కాకుండా మీరు బజాజ్ ఫిన్సర్వ్ EMI కార్డులతో కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు అనేక ఇతర బ్యాంకుల క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల పై కూడా ఈ ఆఫర్ ను పొందవచ్చు. మీరు కనుక ఒక Paytm యూజర్ అయితే, మీరు Paytm Wallet మరియు Paytm UPI ఉపయోగిస్తే, మీకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. హెడ్‌ఫోన్‌లు మరియు స్పీకర్ల పైన ఈ సేల్ నుండి మీకు 80 శాతం తగ్గింపు లభిస్తుందని, ఫ్లిప్‌కార్ట్ టీజర్ ద్వారా ప్రకటిస్తోంది.