Flipkart Big Bang Diwali Sale announced and know the date and deals
2025 దీపావళి పండుగ సందర్భంగా Flipkart Big Bang Diwali Sale అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సేల్ డేట్ మరియు డీల్స్ కూడా ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేసింది. 2025 దసరా పండుగ కోసం అందించిన సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తర్వాత బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ అందించిన ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా ఈ అప్ కమింగ్ సేల్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సేల్ డేట్ మరియు డీల్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ 11 అక్టోబర్ 2025 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ ప్లస్ మరియు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ మెంబర్స్ కోసం ఈ సేల్ యాక్సెస్ 24 గంటల ముందుగా స్టార్ట్ అవుతుంది. ఈ సేల్ కోసం ఈసారి SBI బ్యాంక్ ని సేల్ పార్ట్నర్ గా అనౌన్స్ చేసింది. అందుకే, ఈ సేల్ నుండి SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు తో వస్తువులు కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి చాలా ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డీల్స్ అందించే అవకాశం ఉంటుంది. గత సేల్ నుంచి అందించిన డీల్స్ ద్వారా స్మార్ట్ టీవీ లపై అతి భారీ డిస్కౌంట్ అందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించిన కొత్త GST 2.0 రీఫార్మ్ ఇందుకు ప్రధాన కారణం అవుతుంది.
రీసెంట్ గా ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన సేల్స్ దృష్టిలో ఉంచుకుని చూస్తే, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు, ల్యాప్ టాప్, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ మరియు డిష్ వాషర్ వంటి ప్రొడక్ట్స్ మంచి డిస్కౌంట్ ధరలో లభించే అవకాశం ఉంటుంది. ఈ సేల్ నుంచి ఫ్యాషన్ మరియు బ్యూటీ ప్రొడక్ట్స్ తో పాటు ఇంటి డెకరేషన్ వస్తువుల పై కూడా గొప్ప డిస్కౌంట్ అందిస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Sony Dolby Atmos సౌండ్ బార్ ను దివాళి సేల్ నుంచి మరింత తక్కువ ధరకు అందుకోండి.!
అయితే, ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ నుంచి కూడా మంచి డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుని ఈరోజు స్మార్ట్ టీవీ మరియు సౌండ్ బార్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.