ఉగాదికి ముందు వస్తున్నఫ్లిప్ కార్ట్ భారీ సేల్.. ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..!

Updated on 31-Mar-2022
HIGHLIGHTS

ఉగాది కి ఒకరోజు ముందుగా ఫ్లిప్ కార్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది

ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ ను చాలా తక్కువ ధరకే పొందవచ్చు

ఈరోజు అర్ధరాత్రి నుండి మొదలవనున్నఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ ధమాల్ సేల్

తెలుగు సంవత్సరాది ఉగాది కి ఒకరోజు ముందుగా ఫ్లిప్ కార్ట్ యొక్క Bhachat Dhamaal sale మొదలవుతుంది. రెగ్యులర్ గా ప్రకటించే ఈ సేల్ ఈసారి ఉగాదికి పండుగ సమయానికి అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ ను చాలా తక్కువ ధరకే పొందవచ్చు.  ఈ సేల్ ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈరోజు అర్ధరాత్రి నుండి మొదలవనున్న ఈ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్, టీవీలు, మొబైల్స్ మరియు యాక్ససరీస్ పైన మంచి డీల్స్ అఫర్ చేయనున్నట్లు కూడా చెబుతోంది.

ఈ సేల్ నుండి ఎంపిక చేసిన కొన్ని టీవీల పైన బ్లాక్ బాస్టర్ టీవీ డీల్స్ ద్వారా గరిష్టంగా 70% వరకూ డిస్కౌంట్ ను పొందవచ్చు అని Flipkart ప్రకటించింది. అంతేకాదు, ఫిట్ నెస్ బ్యాండ్స్, ఇయర్ ఫోన్స్, ట్రిమ్మర్లు, ఫోన్ కవర్లు, ఛార్జర్ మరియు వంటి మరిన్ని ప్రోడక్ట్స్ పైన కూడా భారీ డిస్కౌంట్ లను అందుకోవచ్చు.  మొబైల్ విభాగంలో కూడా టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పైన డిస్కౌంట్ లను మరియు మరిన్ని ఆఫర్లను కూడా ఇవ్వనున్నట్లు చెబుతోంది .   

ఇక మరిన్ని డీల్స్ విషయానికి వస్తే, ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి 8 గంటల వరకు ధమాల్ డీల్స్ అఫర్ ద్వారా కొత్త ప్రోడక్ట్ డీల్స్ ను అందిస్తుంది. అలాగే, Loot Bazaar మరియు Combo Deals వంటి మరిన్ని డీల్స్ ను కూడా ఈ సేల్ నుండి అందిస్తోంది. ముఖ్యంగా, ఈ సేల్ నుండి ఫ్యాషన్ మరియు బ్యూటీ ప్రోడక్ట్స్ ను చాలా చవక ధరకే పొందవచ్చనిటీజ్ చేస్తోంది.బిగ్ బచాత్ ధమాల్ సేల్ నుండి ఉచిత డెలివరీ మరియు సులభమైన రిటర్న్స్ గురించి పేర్కొంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :