2022 కొత్త సంవత్సరంలో Flipkart మొదటి సేల్ Flipkart Big Bachat Dhamaal ను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 7 నుండి జనవరి 9 వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన మంచి ఆఫర్లను అందించనున్నట్లు Flipkart టీజ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో టీవీలు, మొబైల్స్ తో పాటుగా హోమ్, కిచెన్ సామానులను కూడా తక్కువ ధరకే పొందవచ్చని చెబుతోంది.
ఈ అప్ కమింగ్ సేల్ నుండి సెలెక్ట్డ్ ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ పైన గరిష్టమైన డిస్కౌంట్ అఫర్ చెయ్యనునట్లు Flipkart ప్రకటించింది. వీటిలో, టీవీలు, మొబైల్స్, ఇయర్ ఫోన్స్, డెస్క్ టాప్, ట్రిమ్మర్లు, ఫిట్ నెస్ బ్యాండ్స్, ఫోన్ కవర్లు, ఛార్జర్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి.
ఇక మరిన్ని డీల్స్ విషయానికి వస్తే, ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి 8 గంటల వరకు ధమాల్ డీల్స్ అఫర్ ద్వారా కొత్త ప్రోడక్ట్ డీల్స్ ను అందిస్తుంది. అలాగే, Loot Bazaar మరియు Combo Deals వంటి మరిన్ని డీల్స్ ను కూడా ఈ సేల్ నుండి అందిస్తోంది. ముఖ్యంగా, ఈ సేల్ నుండి ఫ్యాషన్ మరియు బ్యూటీ ప్రోడక్ట్స్ ను చాలా చవక ధరకే పొందవచ్చని టీజ్ చేస్తోంది
Big Bachat Dhamaal నుండి ఉచిత డెలివరీ మరియు సులభమైన రిటర్న్స్ గురించి కూడా టీజ్ చేస్తోంది. ఈ సేల్ మొదలవడానికి మరికొన్ని రోజుల సమయం ఉంది కాబట్టి మరిన్ని అఫర్ల గురించి రానున్న రోజుల్లో ప్రకటించవచ్చు.