మీరు మీ పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN) ను మీ ఆధార్ కార్డ్ తో లింక్ చేయ్యలేదా? అయితే, మార్చి 31 వ తేదీ లోపుగా మీ పాన్-ఆధార్ లింక్ చెయ్యడం మంచిది. లేదంటే మీ కథ కంచికి చేరినట్లే. ఎందుకంటే, ఎవరైతే గడువు ముగిసే లోపుగా పాన్-ఆధార్ లింక్ చెయ్యని వారికీ అక్షరాలా 1,000 రూపాయల ఫైన్ విధిస్తుంది.
ఫైనాన్స్ బిల్, 2021 లో దీని కోసం సవరణ చేసింది. దీని ప్రకారం, పైన పైన తెలిపిన 1,000 ఫైన్ తో పాటుగా ఆ వ్యక్తి యొక్క పాన్ PAN పూర్తిగా నిలిపివేయ బడుతుంది. అంటే, మార్చి 31 లోపుగా PAN-AADHAAR లింక్ చేయని వారి PAN పనిచేయ్యకపోవడమే కాకుండా 1000 ఫైన్ కూడా సమర్పించుకోవాలన్న మాట..!
అందుకే, వెంటనే మీ PAN-AADHAAR లింక్ చెయ్యడం మంచిది. దీని కోసం ఆఫీసుల చుట్టూ లేదా నెట్ సెంటర్లు లేదా మరెవరినైనా సంప్రదించాల్సిన పనిలేదు. పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి, ఆదాయ పన్ను శాఖ కొత్త ఎస్ఎమ్ఎస్ సేవను ప్రారంభించింది.
దీని కోసం మీరు UIDPAN అని టైప్ చేసిన తరువాత స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నంబరును ఎంటర్ చేసి ఈ SMS ను 567678 నంబరుకు లేదా 56161 కు పంపాలి. UIDPAN<స్పెస్><ఆధార్ నంబర్><స్పేస్><పాన్ నంబర్> ఈ ఫార్మాట్ లో 567678 నంబరుకు లేదా 56161 కు పంపాలి. అదనంగా, ఇ-ఫైలింగ్ వెబ్సైట్ విభాగానికి ఇది అనుసంధానించబడుతుంది.
ఉదాహరణ : UIDPAN 123456123456 ABCDF2019A