itel భారతీయ మార్కెట్లో బడ్జెట్ మరియు ఫీచర్ ఫోన్లకు ప్రసిద్ది చెందిన సంస్థ. అయితే, ఇక మొబైల్ ఫోన్ తయారీ సంస్థ కేవలం ఫీచర్ లేదా బడ్జెట్ ఫోన్లకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఇప్పుడు ఈ కంపెనీ త్వరలో సరికొత్త ఉపకరణాలను ప్రవేశపెట్టబోతోంది. ఈ సంస్థ ఉపకరణాలను ప్రవేశపెట్టబోతున్నట్లు చాలా కాలంగా నివేదికలు ఉన్నాయి. అయితే, సంస్థ యొక్క అధికారిక Facebook ఖాతా నుండి పోస్ట్ చేసిన టీజర్ ద్వారా ఈ వార్త ధృవీకరించబడింది.
ఇక ఈ టీజర్ ను చూస్తే త్వరలో ఈ ఉపకరణాలు భారతదేశంలో లాంచ్ అవుతాయని చెప్పవచ్చు. సరసమైన ధర వద్ద లభించే ఈ ఉపకరణాలలో బ్లూటూత్ ఉపకరణాలు, హెడ్‌ఫోన్లు మరియు పవర్ బ్యాంకు లను ప్రారంభించవచ్చు. కొత్త విభాగంలోకి ప్రవేశించిన తరువాత, ఫీచర్ ఫోన్లు మరియు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఇతర ఉత్పత్తులపై కంపెనీ తన దృష్టిని సారించనుంది.
ఈ సంస్థ యొక్క చరిత్రను చూస్తే, ఈ ఉపకరణాలు సరసమైన ధరలకు ప్రజలను ఆకర్షించే విధంగా విడుదల చేస్తుందని ఖఛ్చితంగా ఆశించవచ్చు. itel ఇప్పటికే స్మార్ట్ ఫోన్ మరియు ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించింది. కౌంటర్ పాయింట్ మరియు సిఎమ్ఆర్ మార్కెట్ పరిశోధన నివేదిక ప్రకారం, ఫీచర్ ఫోన్ విభాగంలో itel 22% మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో నిలిచింది.