EPFO: e-నామినేషన్ పై తప్పుడు ప్రచారం.. అసలు విషయం ఇది..!!

Updated on 29-Mar-2022
HIGHLIGHTS

e-నామినేషన్ చివరి తేదీ పైన తప్పుడు ప్రచారం

అనేక కధనాలు ఆన్లైన్లో చెక్కర్లు కొడుతున్నాయి

ఆఖరి తేదీ ఇంకా ప్రకటించలేదని EPFO వివరించింది

EPFO: e-నామినేషన్ పైన తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మొత్తుకుంటోంది. గత కొద్ది కాలంగా ఎంప్లాయిస్ వారి e-నామినేషన్ నమోదు చేయడానికి చివరి తేదీ మార్చి 31 గా అనేక కధనాలు ఆన్లైన్లో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే, వాస్తవానికి అటువంటిది ఏమిలేదని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తేల్చిచెప్పింది. దీనికి సంబంధించి ఎటువంటి అబద్ద ప్రచారాన్ని నమ్మవద్దని కూడా EPFO అధికారిక వెబ్ సైట్ సాక్షిగా నోటీస్ ను స్క్రోల్ చేస్తోంది.

మార్చి 31 వ తేదీతో ముడిగియనున్నది e-నామినేషన్ అప్డేషన్ కాదని, ABRY స్కీమ్ నమోదు కోసం విధించిన గడువు. అలాగే, e-నామినేషన్ అప్డేషన్ కోసం ఎటువంటి ఆఖరి తేదీ ఇంకా ప్రకటించలేదని EPFO వివరించింది. ABRY స్కీమ్ అంటే ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన స్కీమ్ అని అర్ధం. దీని ద్వారా నెలకు 15 వేల కంటే తక్కువ జీతం తీసుకునే ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగస్తులు ఇన్సెంటివ్స్ అందుకోవచ్చు.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పోర్టల్ నమోదు చేసుకున్న తేదికి నుండి 24 నెలల తరువాత ఈ ఇన్సెంటివ్స్ పొందుతారు. ABRY స్కీమ్ కోసం రిజిష్టర్ చేసుకోవడానికి మార్చి 31 వ తేదీ చివరి తేదీ మరియు  EPFO దీని గురించి మాత్రమే చెబుతోంది e-నామినేషన్ గురించి కాదు. అయితే, ఈ ABRY స్కీమ్ కోసం ఎంప్లాయర్ (కంపెనీ) రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది, ఎంప్లాయిస్ కాదు.

ఇది మాత్రమే కాదు, EPFO పేరుతో ఆన్లైన్ ఎటువంటి APP లేదు కేవలం UMANG యాప్ మాత్రమే PF కి సంబంధించిన వివరాలను అందించే యాప్. ఎటువంటి ఇతర యాప్ లను నమ్మి మీ వివరాలను, అంటే ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ లేదా ఇంకేదైనా వివరాలను ఇవ్వరాదని కూడా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :