ఈ నంబర్ నుండి మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి… ఎందుకంటే..!

Updated on 21-Dec-2021
HIGHLIGHTS

ఇంటర్నెట్ మోసాల గురించి జాగ్రత్త వహించాలని ఇటీవల హెచ్చరించారు

ఎగ్జిక్యూటివ్‌ల ముసుగులో KYC వెరిఫికేషన్ నకిలీ మెసేజెస్ అందుకుంటున్నారు

స్పాండ్ ఇచ్చినప్పుడు వారిని లక్ష్యంగా చేసుకోవడం జరుగుతుంది

ప్రస్తుతం అన్ని పనులు కూడా ఆన్లైన్లోనే చాలా ఈజీగా నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ సిస్టం కూడా ప్రజలకు చాలా ఉపయోగడుతోంది. ముఖ్యంగా, మహమ్మారి సమయంలో ఆన్లైన్ చెల్లింపులు చాలా కీలకపాత్ర వహించాయి. కానీ, సులభమైన ఆన్‌లైన్ పేమెంట్ ప్రయోజాలతో పాటుగా ఈజీగా చేసే మోసాలు కూడా పుట్టుకొచ్చాయి మరియు ఇవి ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఇవి ప్రజలకు చాలా హాని కలిగిస్తున్నాయి.

ఇప్పుడు కొత్త స్కామ్ గురించి జాగ్రత్తగా ఉండాలని ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ టెలికాం వినియోగదారులు  ఇంటర్నెట్ మోసాల గురించి జాగ్రత్త వహించాలని ఇటీవల హెచ్చరించారు. మరి ఆ విషయం ఏమిటో తెలుసుకుందామా.  

KYC వెరిఫికేషన్ అని చెప్పబడే ఒక స్పామ్ మెసేజ్ ద్వారా కొత్త స్కామ్ కు పాల్పడుతున్నట్లు సూచించారు. ఈ SMS లో ఏమని  ఉంటుందంటే, ఈ మెసేజ్ కు రెస్పాండ్ అవ్వకపోతే మీ నంబర్ 24 గంటల్లో బ్లాక్ అవుతుందని ఉంటుంది. Airtel, Vodafone, Idea మరియు Jio యూజర్లు కూడా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల ముసుగులో KYC వెరిఫికేషన్ కోసం అంటూ చెప్పబడే నకిలీ మెసేజెస్ అందుకుంటున్నారు. ట్విటర్ సాక్షిగా చాలామంది వినియోగదారులు ఈ విషయం గురించి వెల్లడించారు.

ఎయిర్టెల్ నంబర్ కలిగిన కస్టమర్లు, వారి మొబైల్ నంబర్ కు 9114204378 నంబర్ నుండి 0 అనే మెసేజ్ అందుకుంటున్నారు. లోపలికి వెళితే అందులో, 'డియర్ ఎయిర్టెల్ కస్టమర్, ఈ రోజు మీ సిమ్ నిలిపివేయబడుతుంది. మీ SIM కార్డు ను అప్డేట్ చేసుకోండి' దీని కోసం మీరు వెంటనే 8582845285 కాల్ చేయండి, అని ఉంటుంది. అంతేకాదు, మీరు వెంటనే సంప్రదించగా పొతే మీ సిమ్ బ్లాక్ అవుతుందని కూడా చూపిస్తుంది. ఈ రకమైన మేసేజెస్  ద్వారా వినియోగదారుల దృష్టి మరల్చడం మరియు వారు రెస్పాండ్ ఇచ్చినప్పుడు వారిని లక్ష్యంగా చేసుకోవడం జరుగుతుంది. ఈవిధంగా వారి నుండి వివరాలను రాబట్టి వారి బ్యాంకుల నుండి డబ్బును విత్ డ్రా చేయడం జరుగుతోంది.

అందుకే, ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం చాల మంచిది. ఆన్లైన్ మాసాలకు ముఖ్యంగా కావాల్సింది 'OTP' కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వచ్చే OTP లను ఎట్టిపరిస్థితుల్లోను మరొకరితో షేర్ చెయ్యకండి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :