Digit Zero 1 Awards 2024 24th edition awards announced today
Digit Zero 1 Awards 2024: టెక్నాలజీ వార్తలు, రివ్యూలు, వీడియోలు మరియు మ్యాగజైన్ తో ప్రజల మనసులలో తనదైన ముద్ర వేసిన న్యూస్ ఛానల్ లలో డిజిట్ ఒకటిగా నిలుస్తుంది. అంతేకాదు, ప్రతి సంవత్సరం కూడా కొత్త టెక్నాలజీ తో వచ్చిన ల్యాప్ టాప్స్, మొబైల్స్, టీవీలు మరియు ఆడియో ప్రోడక్ట్స్ లో గొప్ప పెర్ఫార్మెన్స్ తో తనదైన ముద్ర వేసిన ప్రోడక్ట్ సత్కరిస్తుంది. డిజిట్ టీమ్ చేపట్టే టెస్ట్ లలో అన్నింటి కన్నా ముందు వరసలో ఉండే ప్రతి ప్రోడక్ట్ మరియు ఆ ప్రోడక్ట్ అందించిన బ్రాండ్ ను కూడా డిజిట్ సత్కరిస్తుంది.
ఈ సత్కార పురస్కారమే మా ఈ డిజిట్ జీరో 1 అవార్డ్స్ కార్యక్రమం. ఈరోజు న్యూ ఢిల్లీ ఏరోసిటీ స్పేస్ లోని JW మార్రియట్ లో నిర్వహించిన ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా మొబైల్, ల్యాప్ టాప్, టీవీలు మరియు ఆడియో విభాగాల్లో విన్నర్ గా నిలిచిన విజేతలకు అవార్డు అందించింది.
డిజిట్ యొక్క ఈ ప్రత్యేకమైన అవార్డ్స్ కార్యక్రమం నుంచి మూడు విభాగాలలో అవార్డులు అందించింది. Digit Best Buy, Digit Zero 1 winner మరియు Digit Popular Choice Awards ను అందించింది. ఈరోజు ఈ మూడు విభాగాలలో విజేతలుగా నిలిచిన వారికి ఈరోజు డిజిట్ టీమ్ అవార్డు ప్రధానం చేసింది. ఈరోజు డిజిట్ ప్రకటించిన అవార్డ్స్ మరియు అవార్డు గ్రహీత వివరాలు అప్డేట్స్ మీకు అంధిస్తాము.